Lucky zodiac signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి శుభ ఘడియలు మొదలవుతాయి- విలాసవంతమైన జీవితం గడుపుతారు
Lucky zodiac signs: విలాసాలకు అధిపతిగా భావించే శుక్రుడు సెప్టెంబర్ 18న తన సొంత రాశి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఘడియలు మొదలవుతాయి. వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. డబ్బు ఆదా చేసుకుంటారు.
Lucky zodiac signs: శుక్రుడు తొమ్మిది గ్రహాలలో విలాసవంతమైన గ్రహం. సంపదకు, శ్రేయస్సుకు, విలాసానికి మూలం. రాశిచక్రంలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటే వారికి అన్ని రకాల యోగాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. శుక్ర గ్రహం ప్రేమ, ఆకర్షణకు కారకంగా పరిగణిస్తారు.
ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న శుక్రుడు సెప్టెంబర్ 18 నుంచి తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి శుక్రుడు అధిపతి. అందువల్ల సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఇది అత్యంత శుభకరమైన యోగంగా పరిగణిస్తారు.
ఈ యోగం ఏర్పడటం వల్ల ప్రజల జీవితాలలో వివిధ మార్పులు సంభవిస్తాయి. ఈ యోగం శుభ ప్రభావం వలన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగస్తులు అపారమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది. అదే సమయంలో వ్యాపారాలు చేసే వాళ్ళు వివిధ ఒప్పందాల నుండి భారీ లాభాలను పొందవచ్చు. శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడిన మాలవ్య యోగం ఎవరికి శుభాలు చేకూరుస్తుందో చూద్దాం.
మేష రాశి
ఈ కాలంలో శుక్రుడు మేష రాశి ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ ఇంట్లో మాలవ్య యోగం ఏర్పడుతుంది. దీని వల్ల తమ కార్యాలయంలో అపారమైన ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు విజయం సాధిస్తారు. పనిలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. కెరీర్ ని దెబ్బతీసే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, శాంతి, సంతోషం ఉంటాయి.
తులా రాశి
తులా రాశి వారి లగ్న గృహంలో మాలవ్య యోగం ఏర్పడుతుంది. శుక్రుడి బలం దాని స్వంత రాశిచక్రంలోకి మారినప్పుడు అనేక రెట్లు పెరుగుతుంది. అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అప్పుల ఊబి నుంచి విముక్తి కలుగుతుంది. డబ్బు సంపాదించడమే కాకుండా ఆదా చేయగలుగుతారు. ఈ యోగం వల్ల తులా రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. మంచి మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన సమయం. దీని నుండి అధిక రాబడిని పొందుతారు. ప్రేమ జీవితంలో, ఆనందం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, పరస్పర సమన్వయం పెరుగుతుంది. ఒంటరి వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి పదకొండవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. మాలవ్య యోగం వీరికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. అపరిమిత సంపదను పొందుతారు. కుటుంబ జీవితానికి అనుకూలమైన సమయం. వ్యాపారవేత్తలు తమ రంగాలలో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో శాంతి, సంతోషం ఉంటుంది. ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.