Vinakaya chavithi 2024: వినాయక చవితి పూజకు ఇదే అనువైన ముహూర్తం, విగ్రహ ప్రతిష్టాపన నియమాలు ఇవే
Vinakaya chavithi 2024: సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి పండుగ జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని తొలిసారిగా ఇంటికి తీసుకొస్తున్నారా? అయితే ఎప్పుడు ప్రతిష్టించుకోవాలి. ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలో తెలుసుకోండి. ప్రతిష్టాపన నియమాలు తప్పకుండా అనుసరించాలి.
Vinakaya chavithi 2024: గణేష్ చతుర్థి పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పండుగ వినాయకుడి పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి రోజున, జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీకగా పిలిచే వినాయకుడిని పూజిస్తారు. భాద్రపద మాసం శుక్ల పక్షం నాలుగో రోజున వినాయకుడు జన్మించాడని నమ్ముతారు.
వినాయక చవితి 2024 ఎప్పుడు
2024 లో వినాయక చవితి శనివారం సెప్టెంబర్ 07 న వచ్చింది. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు వినాయకుడి విగ్రహాన్ని తమ ఇంటికి తీసుకువచ్చి ప్రతిష్టించి నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు.
గణపతి స్థాపన, పూజ ముహూర్తం
గణేశుడి మధ్యాహ్నం కాలంలో జన్మించాడని నమ్ముతారు. అందువల్ల మధ్యాహ్నం సమయం గణేష్ ఆరాధనకు అత్యంత అనువైనదిగా పరిగణిస్తారు. ధృక్ పంచాంగం ప్రకారం, గణేష్ చతుర్థి రోజున మధ్యాహ్నం గణపతి పూజ ముహూర్తం ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 01:00 వరకు ఉంటుంది. ఆరాధన మొత్తం వ్యవధి 02 గంటల 31 నిమిషాలు.
చతుర్థి తిథి
ధృక్ పంచాంగం ప్రకారం చతుర్థి తిథి 03:03 PM నుండి 06 సెప్టెంబర్ 2024 నుండి సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5.37గంటల వరకు ఉంటుంది.
గణేష్ నిమజ్జనం ఎప్పుడు?
గణేష్ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఇది అనంత్ చతుర్ధశి రోజున ముగుస్తుంది. ఈ రోజు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది గణేష్ విసర్జన్ మంగళవారం 17 సెప్టెంబర్ 2024 న ఉంది. అనంత్ చతుర్ధశి రోజున భక్తులు గణపతి బప్పాకు వీడ్కోలు పలుకుతారు. గణేశుని విగ్రహాన్ని చెరువు, సరస్సు లేదా నదిలో నిమజ్జనం చేసే సంప్రదాయం ఉంది.
ఎలాంటి విగ్రహం తీసుకోవాలి?
మొదటి సారి మీరు వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి విగ్రహం ఇంటికి తీసుకొస్తే బాగుంటుందో తెలుసుకోవాలి. గణేష్ విగ్రహాన్ని ఎన్నుకునేటప్పుడు తొండం ఎడమ వైపు వంగి ఉన్న దాన్ని ఎంచుకోవడం చాలా శుభంగా పరిగణిస్తారు. అలాగే కూర్చుని ఉన్న గణేష్ విగ్రహం కొనుగోలు చేయండి. ఇది ఆనందం, శ్రేయస్సును సూచిస్తుంది. అలాగే గణేషుడి భంగిమలో ఒక చేతిలో మోదక్, రెండో చేత్తో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉంటే మంచిది.
ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించవచ్చు. విగ్రహం ఉత్తరం వైపు ఎదురుగా ఉండాలి. శుభ్రమైన వేదిక వేసి దాని మీద ప్రతిష్టించాలి. ఈ దిశలో విగ్రహాన్ని పెట్టడం వల్ల ఇంటికి సానుకూల శక్తి, ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ఎప్పుడు ఒకటి కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. అది మాత్రమే కాదు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు. లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పక్కన ఏర్పాటు చేయాలి.
ఏ రంగు మచిది?
విగ్రహం ఎరుపు లేదా కుంకుమ రంగులో ఉన్నది ఇంటికి తీసుకురావడం మంచిది. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది, జీవితంలో ఏవైనా అడ్డంకులు లేదా సమస్యలు ఉంటే తొలగిస్తుందని నమ్ముతారు. మీరు తెలుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని తీసుకురావచ్చు. ఇది ఇంటికి ఆనందం, శాంతిని అందిస్తుంది.
గంగాజలంతో శుద్ది చేసిన తర్వాత పూజలు చేయాలి. మూడు, ఐదు, ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి. పండ్లు, పూలతో అలంకరించాలి. నైవేద్యం సమర్పించాలి.