Fashion Zodiac signs: ఈ ఐదు రాశుల వారి డ్రెస్సింగ్ చెత్తగా ఉంటుందట, వీరు కొంచెం ఫ్యాషన్ సెన్స్ నేర్చుకోవాల్సిందే-these five zodiac signs are the worst in dressing they need to learn some fashion sense ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Fashion Zodiac Signs: ఈ ఐదు రాశుల వారి డ్రెస్సింగ్ చెత్తగా ఉంటుందట, వీరు కొంచెం ఫ్యాషన్ సెన్స్ నేర్చుకోవాల్సిందే

Fashion Zodiac signs: ఈ ఐదు రాశుల వారి డ్రెస్సింగ్ చెత్తగా ఉంటుందట, వీరు కొంచెం ఫ్యాషన్ సెన్స్ నేర్చుకోవాల్సిందే

Haritha Chappa HT Telugu
Sep 24, 2024 09:56 AM IST

Fashion Zodiac signs: రాశులను బట్టి డ్రెస్సింగ్ ఆధారపడి ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఫ్యాషన్ అంటే ఎక్కువ ఇష్టం. కానీ కొందరికి మాత్రం ఆ సెన్స్ ఉండదు. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

ఫ్యాషన్ సెన్స్ ఉండే రాశులు ఇవే
ఫ్యాషన్ సెన్స్ ఉండే రాశులు ఇవే (pixabay)

Fashion Zodiac signs: కొందరు చాలా అందంగా తయారవుతారు. వారికి ఫ్యాషన్ సెన్స్ కూడా అధికంగానే ఉంటుంది. మరికొందరు మాత్రం చెత్త డ్రెస్సింగ్‌తో కనిపిస్తారు. వారికి కలర్ కాంబినేషన్ పట్ల కూడా ఎలాంటి అవగాహన ఉండదు. కొందరికి పుట్టుకతోనే మంచి ఫ్యాషన్ సెన్స్ ఉంటుంది. వారు ఆ రంగంలో కూడా రాణిస్తారు. వారు వేసుకున్న డ్రెస్సులు ఇతరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారు ఫ్యాషన్ ఐకాన్లుగా, ట్రెండ్ సెట్టర్లుగా మారుతూ ఉంటారు. రాశులను బట్టి కూడా ఫ్యాషన్ సెన్స్ అనేది వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. కొన్ని రాశుల వారికి డ్రెస్సింగ్ సెన్స్, స్టైల్ అధికంగా ఉంటే, మరికొందరికి చాలా వరస్ట్ గా ఉంటుందట. మీ రాశి వారికి ఫ్యాషన్ సెన్స్ ఉందో లేదో తెలుసుకోండి.

మిథున రాశి

ఈ రాశి వారికి ఫ్యాషన్ సెన్స్ ఏమీ ఉండదు. వారి డ్రెస్సింగ్ కూడా అంత బాగోదు. వారి దుస్తులు అసాధారణంగా అనిపిస్తాయి. ఏమి వేసుకోవాలో కూడా వారికి అర్థం కాదు. ఒక్కోసారి గందరగోళంగా పడిపోతూ ఉంటారు. రంగులు కూడా సరిగ్గా ఎంచుకోలేరు. మీరు సృజనాత్మకత ఉన్న వ్యక్తులే, కానీ ఫ్యాషన్ సెన్స్ మాత్రం ఉండదు. అందుకే వారి దుస్తులు చాలా సాధారణంగా ఉంటాయి.

కర్కాటక రాశి

వీరు ఎలాంటి ఫ్యాషన్ ను ఇష్టపడరు. సౌకర్యవంతమైన హాయిగా ఉండే దుస్తులను వేసుకోవాలనుకుంటారు. వారి వార్డురోబ్ లో అన్ని దుస్తులు వేలవమైన రంగులనే కలిగి ఉంటాయి. పైజామాతో సింపుల్‌గా కనిపిస్తారు. బూడిద, గోధుమ, నలుపు రంగులతో కూడిన దుస్తులను ఎక్కువగా కొంటూ ఉంటారు.

కన్యారాశి

ఈ రాశి వారిని బుధుడు పరిపాలిస్తాడు. వీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వైఖరిని కలిగి ఉంటారు. మీరు ఎంత గొప్పగా డ్రెస్సింగ్ చేసుకోవాలనుకున్నా అది వారి వల్ల కాదు. అందంగా తయారవ్వాలన్న తపనతో విచిత్రంగా తయారవుతూ ఉంటారు. పెద్ద పెద్ద నెక్లెస్లు, అర్థం లేని అలంకారాలతో కనిపిస్తారు. వీరికి ఏ రంగు దుస్తులు తమకు నప్పుతాయో, ఏ రంగు దుస్తులను వేసుకోవాలో, ఎలా తయారవాలో కూడా తెలియదు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు సాధారణంగా నిర్భయంగా ఉంటారు. ధైర్యంగా ముందుకెళతారు. అయితే డ్రెస్సింగ్ విషయానికి వస్తే మాత్రం బోల్డ్ గా ఉండే రంగులను ఎంచుకుంటారు. వారు ఎంచుకునే రంగులు ఎదుటివారికి ఫన్నీగా అనిపిస్తాయి. ఎదుటి వారి దృష్టిని ఆకర్షించాలనే తపన వీరిలో ఉంటుంది. కానీ వారు వేసుకునే దుస్తులు ఎదుటివారిని ఆకర్షించవు సరి కదా, ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. ఫ్యాషన్ ఏమాత్రం తెలియని రాశి ఇది.

ధనస్సు

ఈ రాశి వారు వార్డ్ రోబ్‌లో అన్నీ మెరిసే దుస్తులే కనిపిస్తాయి. డిస్కో డాన్సర్ లా కనిపించేందుకు ఇష్టపడతారు. ధనుస్సును బృహస్పతి పరిపాలిస్తారు. లెదర్‌తో చేసిన వస్తువులను వేసుకునేందుకు ఇష్టంగా ఉంటారు. సరిపోలని రంగుల కలయికతో దుస్తులను వాడతారు. అందుకే ధనస్సు రాశి వారికి డ్రెస్సింగ్ సెన్స్ అసలు ఉండదు. వీరికి ఫ్యాషన్‌గా ఉండాలని అందమైన దుస్తులు వేసుకోవాలనే కోరికలు కూడా ఉండవు. వారు వేసుకునే దుస్తులు అన్ని కాస్త పేలవమైన రంగులోనే ఉంటాయి. దుస్తుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేందుకు కూడా వారు ఇష్టపడరు. ఎదుటివారు ఏమనుకున్నా కూడా తమకు నచ్చినట్టే ఉండేందుకు ప్రయత్నిస్తారు.