Surya Grahanam 2023 । గ్రహణం పడుతోంది.. సూర్యగ్రహణ సమయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!
Surya Grahanam 2023: సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన గురువారం నాడు సంభవిస్తుంది. నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.
Surya Grahanam 2023: మళ్లీ గ్రహణం పడుతోంది. 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20వ తేదీన గురువారం నాడు సంభవిస్తుంది. ఈ గ్రహణం ఏప్రిల్ 20న ఉదయం 7.04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. సూర్యుడు తన కక్ష్యలోనే ఉంటాడు, భూమి తన కక్ష్యలో ఉన్నప్పుడు మధ్యలో చంద్రుడు వస్తాడు. దీనినే గ్రహణం అంటారు, ఈ గ్రహణ నీడ భూమిపై పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనందున, సూతక కాలం మన దేశంలో చెల్లుబాటు కాదు. అయినప్పటికీ జ్యోతిష్య శాస్త్రాల ప్రకారంగా గ్రహణానికి సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉంటాయి.
సూర్యగ్రహణం అశుభకరంగా భావిస్తారు. ఈ సమయంలో దైవశక్తి సన్నగిల్లుతుంది, దుష్టశక్తి ప్రభావం ఎక్కువ ఉంటుందని పురాణాలు చెబుతాయి. అందుకే గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు మలినం అవుతాడని శాస్త్రాలలో ఉంది, అందువల్ల ఇది అశుభంగా భావిస్తారు. కాబట్టి హిందూ శాస్త్రాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయరాదు, కొన్ని చేయాలి. అవేమిటో ఇక్కడ తెలుసుకోండి.
Solar Eclipse 2023 DON'Ts: సూర్యగ్రహణం సమయంలో ఇవి చేయవద్దు
- సూర్యగ్రహణం సమయంలో ఆహారం వండకండి లేదా తినకండి. ఈ సమయంలో ఈ పనులు చేయడం నిషేధించడమైనది.
- సూర్యగ్రహణం రోజున ముందుగా వండిన ఆహారాన్ని ఉంచుకోవద్దు. గ్రహణం ముగిసిన తర్వాత, ఇంటిని శుద్ధి చేసి, ఆపై ఆహారాన్ని తాజాగా వండుకోవాలి.
- సూర్యగ్రహణానికి ముందు ఆహారం వండినట్లయితే, అందులో తులసి ఆకులను, గరికను వేయండి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం ఉండదని నమ్ముతారు
- సూర్యగ్రహణాన్ని ఎప్పుడూ నేరుగా కంటితో చూడవద్దు. ఇలా చేయడం వల్ల మీ కళ్లకు హాని కలుగుతుంది
- గ్రహణ సమయంలో నిద్రించడం గానీ, లేదా ప్రయాణాలు చేయడం వంటివి చేయకూడదు.
- సూర్యగ్రహణం సమయం చాలా అశుభకరమైనదిగా పరిగణిస్తారు, కాబట్టి ఈ సమయంలో ఎలాంటి నూతన పనులను ప్రారంభించవద్దు, శుభకార్యాలను జరపవద్దు.
- గ్రహణ సమయంలో మలవిసర్జనకు కూడా దూరంగా ఉండాలి, మీకు వీలైతే నియంత్రించుకోండి.
- సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్లకుండా ఉండండి, ఎందుకంటే ఈ సమయంలో సూర్యుడు మలినమవుతాడు, ఇది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
Solar Eclipse 2023 DOs: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయండి
- సూర్యగ్రహణం ప్రారంభం కాకముందే ఆహార పానీయాలపై తులసి ఆకులు, గరికను వేయండి.
- సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు ఇంట్లోనే ఒక చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి, నిద్రపోవద్దు.
- సూర్యగ్రహణం సమయంలో ఓం నమ: శివాయ స్మరణ లేదా మరేదైనా శివుని మంత్రాలను జపించండి.
- సూర్యగ్రహణం సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రం అలాగే హనుమాన్ చాలీసా పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించడం జరుగుతుంది.
- గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగాజలం చల్లుకొని ఇంటిని శుద్ధి చేయాలి.
- సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తలస్నానం చేయండి
- సూర్యగ్రహణం వల్ల మీ రాశుల ఆధారంగా కలిగే దుష్ఫలితాలను నివారించడానికి దేవాలయాల్లో పూజలు, దానధర్మాలు చేయాలి
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, ప్రజల నమ్మకాలకు అనుగుణంగా మాత్రమే నివేదించడమైనది. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు, వీటిని మేము ధృవీకరించడం లేదు. ఇది కేవలం సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రచురించిన సమాచారం మాత్రమేనని గ్రహించాలి.
సంబంధిత కథనం
టాపిక్