అక్టోబర్ 14, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వాళ్ళు కీలక పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి-october 14th today rasi phalalu check zodiac wise horoscope predicitons in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్టోబర్ 14, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వాళ్ళు కీలక పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి

అక్టోబర్ 14, నేటి రాశి ఫలాలు- ఈ రాశి వాళ్ళు కీలక పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి

HT Telugu Desk HT Telugu
Oct 14, 2024 12:01 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ14.10.2024 సోమవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

అక్టోబర్ 14 నేటి రాశి ఫలాలు
అక్టోబర్ 14 నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 14.10.2024

వారం: సోమ‌వారం, తిథి : ద్వాదశి,

నక్షత్రం: శతభిషం, మాసం : ఆశ్వయుజము ,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. ఖర్చులు విపరీతం. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలకు శుభఫలితాలున్నాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.

వృషభం

నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం. పట్టుదలకు పోవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలకు సానుకూలంగా స్పందిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపుదనం గ్రహిస్తారు. గృహ మరమ్మతులు చేపడతారు. పత్రాలు, నగదు జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.

మిథునం

ప్రతికూలతలను అనుకూలతలుగా మలుచుకుంటారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఖర్చులు అధికం. రశీదులు, పత్రాలు జాగ్రత్త. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు.

కర్కాటకం

నేటి రాశి ఫలాల ప్రకారం కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సంప్రదింపులకు తగిన సమయం. లావాదేవీల్లో ఒత్తిడికి గురి కావద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ఒక సమాచారం ఊరటనిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా కార్యక్రమాలు కొనసాగిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి.

సింహం

గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో ఒత్తిడి పెరగకుండా చూసు ఖర్చులు అధికం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం మందగిస్తుంది.

కన్య

పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ప్రతికూలతలకు కుంగిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా ప్రవర్తిం చండి. ఇంటి విషయాలపై దృష్టిపెట్టండి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు.

తుల

పరిస్థితులు చక్కబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. రావలిసిన ధనం అందుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. ఇతరుల విషయాలకు దూరంగా ఉం డాలి. కొందరి మాటతీరు కష్టమనిపిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. మిమ్ములను తప్పుపట్టిన వారే మీ విజ్ఞతను గుర్తిస్తారు.

వృశ్చికం

కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుటుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది.

ధనుస్సు

ఒత్తిడి పెరగకుండా చూసు డి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. అందరితోనూ మితంగా సంభాషించండి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.

మకరం

అన్ని విధాలా యోగదాయకం. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. పెద్దల చొరవతో సమస్య సద్దుమణు గుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది.

కుంభం

నేటి రాశి ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈరోజు అనేక వ్యవహారాలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, విశ్రాంతి లోపం. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అధికం, రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు ఒక పట్టాన పూర్తి కావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

మీనం

శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఉచితంగా ఏదీ ఆశించవద్దు. స్వయం కృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆలయాలకు విరాళాలు సమర్పిం చుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

అందించిన వారు: ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ 

 

 

Whats_app_banner