Marriage muhurtham: 2024 లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? ఏయే నెలలో ముహూర్తాలు ఉన్నాయంటే..
Marriage muhurtham: కొత్త ఏడాది పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామితో సరికొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ తేదీల్లో పెళ్లి చేసుకోవడానికి శుభ ఘడియలు ఉన్నాయి.
Marriage muhurtham: మరో రెండు రోజుల్లో పాత సంవత్సరానికి ముగింపు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకబోతున్నాం. కొత్త ఏడాది తమ జీవితం బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. ప్రేమించుకున్న జంట పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తారు. తల్లి దండ్రులు కూడా తమ పిల్లలకి పెళ్లీడు వచ్చిందని ముహూర్తాలు ఉంటే పెళ్లి చేయాలని ఆశ పడతారు.
ప్రస్తుతం ధనుర్మాసం కనుక ఎటువంటి శుభ కార్యాలు చేయరు. జనవరిలో మకర సంక్రాంతి పండుగ తర్వాత నుంచి మంచి ముహూర్తాలు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 2024 లో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి శుభ ఘడియలు ఎప్పుడు ఉన్నాయో ముందుగానే తెలుసుకుంటే సరిగా ప్లాన్ చేసుకోవచ్చని అనుకుంటారు. కొత్త ఏడాది పొడవునా వివాహాలకి శుభ ముహూర్తాలు ఉన్నాయి. అవి ఏయే నెలల్లో ఉన్నాయంటే..
జనవరి నెలలో వివాహ శుభ ముహూర్తాలు
మకర సంక్రాంతి రోజుతో ధనుర్మాసం పూర్తి అయిపోతుంది. అప్పటి నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతాయి. జనవరి 16(మంగళవారం), జనవరి 17( బుధవారం), జనవరి 20( శనివారం), జనవరి 21(ఆదివారం), జనవరి 22(సోమవారం), జనవరి 27( శనివారం), జనవరి 28( ఆదివారం), జనవరి 30( మంగళవారం), జనవరి 31(బుధవారం) పెళ్లి చేసుకునేందుకు అనువైన రోజులు. వీటిలో ఎక్కువగా వీకెండ్స్ రావడం ఉద్యోగులకి బాగా కలిసి వస్తుంది.
ఫిబ్రవరిలో వివాహ తేదీలు
వసంత రుతువు మొదలు అయ్యే నెల ఇది. ఈ ఏడాది లీప్ ఇయర్ కావడంతో ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చాయి. ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయడానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 4(ఆదివారం), ఫిబ్రవరి 6( మంగళవారం), ఫిబ్రవరి 7( బుధవారం), ఫిబ్రవరి 8( గురువారం), ఫిబ్రవరి 12( సోమవారం), ఫిబ్రవరి 13( మంగళవారం), ఫిబ్రవరి 17( శనివారం), ఫిబ్రవరి 24( శనివారం), ఫిబ్రవరి 25( ఆదివారం), ఫిబ్రవరి 26( సోమవారం), ఫిబ్రవరి 29( గురువారం) శుభ ఘడియలు ఉన్నాయి.
మార్చి నెలలో పెళ్ళిళ్ళ తేదీలు
ఎండలు మొదలవుతాయి. ఈ నెలలో ఏయే తేదీల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయంటే.. మార్చి 1( శుక్రవారం), మార్చి 2(శనివారం), మార్చి 3( ఆదివారం), మార్చి 4( సోమవారం), మార్చి 5( మంగళవారం), మార్చి 6( బుధవారం), మార్చి 7( గురువారం), మార్చి 10( ఆదివారం), మార్చి 11( సోమవారం), మార్చి 12( మంగళవారం). వరుసగా రెండు వారాల పాటు శుభ ముహూర్తాలు ఉండటంతో ఈ సమయంలో పెళ్లి మండపాలు దొరకడం కాస్త కష్టం అవుతుంది.
ఏప్రిల్ నెలలో ముహూర్తాలు
ఎండలు కాస్త ముదిరే సమయం. ఈ నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటే శుభ వివాహ తేదీలు ఎప్పుదు వచ్చాయంటే.. ఏప్రిల్ 18( గురువారం), ఏప్రిల్ 19( శుక్రవారం), ఏప్రిల్ 21( ఆదివారం), ఏప్రిల్ 22( సోమవారం). నాలుగు రోజులు మాత్రమే ఉన్నాయి.
పంచాంగం ప్రకారం 2024 మే, జూన్ నెలల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి శుభ ముహూర్తాలు లేవు. ఈ రెండు నెలలు శూన్య మాసం కింద పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచి రోజులు లేవు. అందుకే ముందు నెలల్లో లేదంటే తర్వాత ప్లాన్ చేసుకోవడం మంచిది.
జులై నెలలో శుభ ముహూర్త తేదీలు
రెండు నెలల తర్వాత మళ్ళీ జులై నెలలో పెళ్లి చేసుకునేందుకు మంచి సమయం ఉంది. జులై 9( మంగళవారం), జులై 11( గురువారం), జులై 12( శుక్రవారం), జులై 13( శనివారం), జులై 14( ఆదివారం), జులై 15( సోమవారం) ఉన్నాయి.
మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెళ్లి చేసుకునేందుకు శుభ ఘడియలు లేవు.
నవంబర్ నెలలో వివాహ తేదీలు
మూడు నెలల తర్వాత మళ్ళీ పెళ్లి ముహూర్తాలు రావడంతో కాస్త బిజీ బిజీగా పెళ్లి మండపాలు ఉండబోతున్నాయి. నవంబర్ 12( మంగళవారం), నవంబర్ 13( బుధవారం), నవంబర్ 16( శనివారం), నవంబర్ 17( ఆదివారం), నవంబర్ 18( సోమవారం), సవంబర్ 22( శుక్రవారం), నవంబర్ 23( శనివారం), నవంబర్ 25( సోమవారం), నవంబర్ 26( మంగళవారం), నవంబర్ 28( గురువారం), నవంబర్ 29( శుక్రవారం) మంచి రోజులు.
డిసెంబర్ నెలలో శుభ సమయం
కొత్త సంవత్సరం ఏడాది చివరి నెలలో ఎక్కువ రోజులు మంచి ముహూర్తాలు లేవు. శీతాకాలంలో పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ నెలలో పెళ్లి చేసుకోవచ్చు. డిసెంబర్ 4( బుధవారం), డిసెంబర్ 5( గురువారం), డిసెంబర్ 9( సోమవారం), డిసెంబర్ 10( మంగళవారం) డిసెంబర్ 14(శనివారం).