Makar sankranti: మకర సంక్రాంతి రోజు ఈ రాశుల వారికి అద్భుతమైన లాభాలు వస్తాయ్
Makar sankranti: సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి సంక్రమణం చేయడం వల్ల మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈరోజు కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది.
Makar sankranti: గ్రహాల రారాజు సూర్యుడు జనవరి 15తేదీన మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. మకర రాశిలో సూర్యుని సంచారం చాలా శుభప్రదంగా చెప్తారు. ఆరోజు చేసే దాన ధర్మాలకు విసెసహ ప్రాముఖ్యత ఉంది.
సూర్య భగవానుడు నెలకి ఒకసారి రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది. సూర్యుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గౌరవం, సంపద పెరుగుతాయి. సూర్యుడు తమ కుమారుడి శని సొంత రాశి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆరోజు చేసే దానాల ఫలితం మీకు లభిస్తుంది. శని దేవుడు కూడా మీమీద దయ చూపిస్తాడు. సూర్యుడిని పూజించడం వల్ల శని కూడా సంతోషిస్తాడు. సూర్యుడు రాశి మారడం వల్ల ఈ నాలుగు రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు చేకూరనున్నాయి.
వృశ్చిక రాశి
సూర్య సంచారంతో ధనుస్సు, వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా మారనుంది. మకర సంక్రాంతి రోజు నుంచి ఈ రెండు రాశులకి అదృష్టం పట్టనుంది. ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేపట్టినా కూడా అందులో విజయం సాధిస్తారు. సూర్యుడు ఈ రాశులకి శుభ సూచకాలు ఇవ్వబోతున్నాడు. వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వ్యాపారం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల ధన లాభం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.
కన్య రాశి
సూర్యుడు తన రాశి చక్రం మార్చడం వల్ల కన్య రాశి వారికి కలిసి రానుంది. ఇది వాళ్ళకి విజయం చేకూరే సమయం. ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసిన వారికి, విద్యార్థులు తమ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. చట్టపరమైన విషయాలలో విజయం మీదే అవుతుంది. మకర సంక్రాంతి నుంచి కన్య రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ధనలాభం పొందుతారు.
మకర రాశి
శని సొంతరాశి అయిన మకర రాశిలోకే సూర్యుడు వచ్చాడు. దీంతో ఈ రాశి వారి మీద సూర్య అనుగ్రహం మెండుగా ఉండనుంది. సూర్య రాశి మార్పు మకర రాశి వారికి అనేక సంతోషాలని కలిగిస్తుంది. ప్రతి పని ఆత్మవిశ్వాసంతో చేసుకోవాలి. వివాదాల్లో ఉన్న ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మీరు ఊహించని మార్గం నుంచి డబ్బు పొందుతారు. సంపద పెరుగుతుంది.
కుంభ రాశి
ఈ రాశిలోనే ప్రస్తుతం శని సంచరిస్తున్నాడు. సూర్యుని సంచార ప్రభావం శని ఉన్న కుంభ రాశి మీద కూడా శుభప్రదంగా ఉండనుంది. ఈ సమయం కుంభ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ కాలంలో కొన్ని శుభవార్తలు వింటారు. కోర్టుకి సంబంధించిన కేసులో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అయితే ఈ సమయంలో మీరు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. ఇలా చేస్తే ధన లాభం కంటే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంది.