Magha Snanam: మాఘ మాస స్నానము ఎలా చేయాలి? దీనికి ఉన్న విశిష్టత ఏంటి?
Magha snanam: మాఘ మాసంలో చేసే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మాఘ మాస స్నానం ఎలా ఆచరించాలో పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
మాఘ మాసంలో చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్నానం చేసేటప్పుడు ఆచరించాల్సిన నియమాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
స్నానం చేయడానికి నదిలోకి దిగబోతూ చెప్పే ప్రార్ధనా శ్లోకాలు
శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్,
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే,
సర్వపాపహరం పుణ్యం స్నానం మాఘేతు యత్రుత్వం,
నిర్విఘ్నం కురుమేదేవ ! గంగాధర !
నమోస్తుతే మకర స్థీతరవౌ పుణ్యే మాఘ మాసే
శుభే క్షణే ప్రయాగస్నానమాత్రేణ
ప్రయాంతి హరిమందిరమ్ ప్రాతర్మాఘీ బహిః స్నానం
క్రతుకోటి ఫలప్రదమ్ సర్వపాపహరం నౄణాం సర్వ పుణ్యఫలప్రదమ్
పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి।
మృత్తికాం తే ప్రదాస్యామి ఆహారార్థం ప్రసీద మే
గంగాగంగేతి యో బ్రూయాత్ యోజనానాం
శతైరపి సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకంసగచ్ఛతి
అంబత్వద్దర్శనాన్ముక్తిః నజానే స్నానజం ఫలమ్
స్వర్గారోహణ సోపాన మహాపుణ్యతరంగిణి|
నందినీ నలినీ సీతా మాలినీ చ మహాపగా,
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధగామినీ
భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశనమ్
మాఘే సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ నిరంజనః
స ఏవద్రవరూపేణ గంగాంభో నాత్రసంశయః
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణు స్వరూపిణే
నమోజలధిరూపాయ నదీనాం పతయే నమః
అని చెప్పి మళ్ళీ మూడుసార్లు మునగాలి. ఆపైన సంకల్పం చెప్పుకోవాలి.
సంకల్పం
ఆచమ్య, ఓం కేశవాయనమః
ఓం నారాయణాయనమః
ఓం మాధవాయనమః
(అంటూ మూడుసార్లు నీళ్ళు లోనికిపుచ్చుకోవాలి)
ఓం గోవిందాయనమః,
ఓం విష్ణవేనమః,
ఓం మధుసూదనాయనమ,
ఓం త్రివిక్రమాయ నమః,
ఓం వామనాయనమః,
ఓం శ్రీధరాయనమః,
ఓం హృషీకేశాయనమః,
ఓం పద్మనాభాయనమః,
ఓం దామోదరాయ నమ,
ఓం సంకర్షణాయ నమః,
ఓం వాసుదేవాయనమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః,
ఓం అనిరుద్ధాయనమః,
ఓం పురుషోత్తమాయనమః,
ఓం అధోక్షజాయనమ,
ఓం నారసింహాయనమః,
ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్దనాయ నమ,
ఓం ఉపేంద్రాయ నమః,
ఓం హరయే నమః,
ఓం శ్రీ కృష్ణాయనమః
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః
ఏతే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మసమారభే,
ఓం భూః, ఓం భువః, ఓం సువః ఓం మహః, ఓంజన, ఓం తపః ఓం సత్యం,
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి
ధియో యోనః ప్రచోదయాత్,
ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భు వస్సురోమ్
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే శోభనే ముహూర్తే, శ్రీమహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య, అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే, కృష్ణా, గంగా- గోదావర్యోర్మద్యదేశే, అస్మిన్ వర్తమాన వ్యావ హారిక చాంద్రమానేన శ్రీ ......సంవత్సరే, ..ఆయనే…. రుతౌ, ఆయురారోగ్య ఐశ్వర్య చతుర్విధ పురుషార్థ సకల పాప నివృత్త్యర్ధం గతే సవితరి మాఘమాసం అని చదువుకుని ఈ విధంగా అర్ఘ్యం ఇవ్వాలి.
గట్టువీ యాన్మయార్ తత్పాపస్ వాసరే, శుభనక్షత్రే, శుభయోగే శుభకరణే, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ, శ్రీమాన్ గోత్ర నామధేయః (ధర్మపత్నీ సమేతః) శ్రీమతః గోత్రం...............నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య) స్త్రీలకయితే శ్రీమతి గోత్రవతీ నామధేయవతీ సౌభాగ్యవతీ, శ్రీశ్రీమంతా...........గోత్రవత్యాః ...నామధేయవత్యాః(సౌభాగ్యవత్యా:) మమ సకుటంబ బంధుమిత్ర పరివార సమేతస్య (సమేతాయా:) ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం, యోగక్షేమ స్థైర్య విజయ అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయోభివృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, జన్మప్రభృతి మయాకృత జ్ఞాతా జ్ఞాతాది సకల పాప నివృత్త్యర్ధం, గంగాది సమస్త పుణ్య తీర్థస్నానఫల సిద్ధ్యర్థం, మకరం గతే సవితరి మాఘమాసే మహానద్యాం ప్రాతః కాల స్నానం కరిష్యే.
ఈ విధంగా స్నానం చేసి నదీదేవతకూ, సూర్యునికి దోసిళ్ళ నీళ్ళతో అర్ఘ్యం ఇచ్చి గట్టుమీదకి వస్తూ
శ్లోకం
యాన్మయాదూషితం తోయం శరీరమల
సంయుతమ్ తత్పాపస్య విశుద్ధ్యర్ధం
యక్ష్మాణం తర్పయామ్యహమ్.
అంటూ మూడు దోసిళ్ళ నీళ్ళు గట్టు మీద పోసి ఒళ్ళు తుడుచుకుని పొడి బట్టలు కట్టుకుని, సంధ్యావందనాది నిత్యకృత్యాలు ఆచరించి, ఆపైన దైవా రాధన చేయాలని చిలకమర్తి తెలిపారు.
దాన సంకల్పము
ఆచమ్య........ర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ గోత్రః, నామధేయః, దాతాహం......, గోత్రా... నామధేయాయ బ్రాహ్మణాయ, మాఘమాసే శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యం...............దానం కరిష్యే.
శ్లోకం
లక్ష్మీనారాయణోదాతా గ్రహేతాచ జనార్ధనః,
దానే నానేన ప్రీణాతు లక్ష్మీనారాయణ స్సదా
అని దానం ఇవ్వాలి. పుచ్చుకొనే బ్రాహ్మణుడు “ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు వ్రతం సువ్రతమస్తు, ఆయురారోగ్యైశ్వర్యాది సకల శ్రేయోభివృద్ధిరస్తు" అని దీవించి అక్షతలు వేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.