కాలభైరవ అష్టకం: ఇది చదివితే శని, రాహు, కేతు దోషాల నుంచి విముక్తి-kalabhairava ashtakam lyrics in telugu astrological remedy for shani rahu ketu dosham ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కాలభైరవ అష్టకం: ఇది చదివితే శని, రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

కాలభైరవ అష్టకం: ఇది చదివితే శని, రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

HT Telugu Desk HT Telugu
May 13, 2024 10:42 AM IST

కాలభైరవ అష్టకం తెలుగులో ఇక్కడ చదువుకోవచ్చు. ఇది చదివితే శని, రాహు, కేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శత్రుభయం నశిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడుతారు. పాపాలు నశిస్తాయి. కోపం తగ్గుతుంది.

కాలభైరవాష్టకం చదివితే శని రాహు కేతు దోషాల నుంచి విముక్తి
కాలభైరవాష్టకం చదివితే శని రాహు కేతు దోషాల నుంచి విముక్తి (Kalabhairavatv, CC BY-SA 4.0 , via Wikimedia Commons)

కాలభైరవ అష్టకం ప్రతి నిత్యం లేదా కనీసం సోమవారం చదువుకోడం, కాలభైరవుడిని ప్రార్థించడం వలన మనుషులు పాప విముక్తి పొందుతారు. శని, రాహు, కేతు దోషాల నుంచి విముక్తి పొందుతారు. కామ, క్రోధ, మద మాత్సర్యాల నుంచి బయటపడుతారు. రోగాల నుంచి, ప్రమాదాల నుంచి, శత్రువుల నుంచి బయటపడుతారు. నీతిమంతమైన జీవితం గడపడానికి కాలభైరవుడు మార్గదర్శనం చేస్తారని పెద్దలు చెబుతారు.

కాలభైరవ అష్టకం

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం

వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం

నారదాది యోగివృంద వందితం దిగంబరం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం

నీలకంఠం ఈప్సితార్థ దాయకం త్రిలోచనం

కాలకాలం అంబుజాక్షం అక్షశూలం అక్షరం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

శూలటంక పాశదండ పాణిమాది కారణం

శ్యామకాయం ఆదిదేవం అక్షరం నిరామయం

భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం

భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం

వినిక్వణన్ మనోజ్ఞ హేమకింకిణీ లసత్కటిం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గ నాశకం

కర్మపాశ మోచకం సుశర్మదాయకం విభుం

స్వర్ణవర్ణశేషపాశ శోభితాంగమండలం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం

నిత్యం అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం

మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రమోక్షణం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

అట్టహాస భిన్నపద్మజాండకోశ సంతతిం

దృష్టిపాతనష్టపాప జాలముగ్రశాసనం

అష్టసిద్ధిదాయకం కపాల మాలికంధరం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం

కాశివాసలోక పుణ్యపాపశోధకం విభుం

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం

కాశికా పురాధినాథ కాలభైరవం భజే

 

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం

జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం

శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం

తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం

 

శంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం