Jupiter Transit: గురు గ్రహ సంచారం.. ఈ 4 రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది
Jupiter Transit: 2023 చివరి నెల డిసెంబర్ లో సూర్యుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు సహా ఐదు పెద్ద గ్రహాలు వారి రాశి చక్రాలు మార్చబోతున్నాయి. ముఖ్యంగా గురు గ్రహ సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వారికి కనక వర్షమే.
ఐశ్వర్యం, ఆనందానికి సూచికగా గురు గ్రహాన్ని భావిస్తారు. అందుకే నవగ్రహాలలో గురు గ్రహాన్ని శుభప్రదమైనదిగా చూస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట విరామం తర్వాత రాశి చక్రాన్ని మారుస్తాయి. అలా 2023 చివరి నెల డిసెంబర్ 29వ తేదీన గురుగ్రహం మేష రాశిలో సంచరించబోతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని సంతోషం, సంపద, కీర్తి, వైవాహిక జీవితం, సంతానానికి ప్రతీకగా నమ్ముతారు. గురువు కదలికలు మారడం వల్ల వ్యక్తుల జీవితంలో ప్రధాన రంగాలని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. బృహస్పతి సంచారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. గురు సంచారం వల్ల ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి శుభప్రదంగా మారబోతుంది. వృత్తి, వ్యాపార పరంగా వచ్చే అడ్డంకులు తొలగిపోనున్నాయి. బృహస్పతి వల్ల ఈ రాశుల వారికి మేలు జరగబోతోంది.
కర్కాటకం
వృత్తి పరంగా ఆశించిన స్థాయిలో మన్ననలు పొందుతారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశీయానం వెళ్ళే అవకాశం కూడా ఉంది. వ్యాపారంలో వృద్ధి ఆశించిన దాని కంటే ఎక్కువగానే పొందుతారు. ఉద్యోగుల విషయానికి వస్తే ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉంటుంది. వారి కృషి, అంకిత భావం చూసి ఇతరులు స్పూర్తి పొందుతారు.
సింహరాశి
ఇప్పటి వరకు సమస్యలు ఎదుర్కొంటున్న సింహ రాశి వారికి మహర్దశ రాబోతుంది. అదృష్టం వరిస్తుంది. వృత్తి పరంగా అనేక అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పని చేసే చోట గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనును అందరూ ప్రశంసిస్తారు.
కన్య రాశి
2024 సంవత్సరంలో కన్య రాశి వారికి బృహస్పతి శుభ ఫలితాలు ఇస్తాడు. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రతి రంగంలోనే అపారమైన విజయం సాధిస్తారు.
మీన రాశి
2024 ఏడాది మీన రాశి వారి సంపద బాగా పెరుగుతుంది. ధనవంతులు కాబోతున్నారు. వ్యాపారంలో వృద్దికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.