Indian spices: భారతీయులు వాడే మసాలా దినుసులకు నవగ్రహాలకు సంబంధముందా? కొన్నింటిని తీసుకుంటే గ్రహ దోషాల నుంచ-indian spices are connected to nine planets learn about them for prosperity and health ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Indian Spices: భారతీయులు వాడే మసాలా దినుసులకు నవగ్రహాలకు సంబంధముందా? కొన్నింటిని తీసుకుంటే గ్రహ దోషాల నుంచ

Indian spices: భారతీయులు వాడే మసాలా దినుసులకు నవగ్రహాలకు సంబంధముందా? కొన్నింటిని తీసుకుంటే గ్రహ దోషాల నుంచ

Ramya Sri Marka HT Telugu

Indian spices: భారతీయులు వాడే మసాలాలకు నవగ్రహాలతో సంబంధముందట. జాతకరీత్యా మీకున్న గ్రహ దోషాలను ఆయా గ్రహాలకు ప్రీతికరమైన మసాలా దినుసులతో పరిహారం లభిస్తుందట. ఏయే గ్రహ దోషాల నుంచి ఎలాంటి మసాలా దినుసులు పరిహారాన్ని ఇస్తాయో తెలుసుకుందాం.

మసాలా దినుసులకు గ్రహాలకు ఉన్న సంబంధం ఏంటి? (Unsplash)

భారతదేశంలో వేల రకాలైన మసాలా దినుసులు ఉత్పత్తి చేస్తుంటారు. కూరల్లోనూ లేదా ఏదైనా ప్రత్యేకమైన వంటకాల్లోనూ మసాలాలను వాడుతుంటాం. ఆయా మసాలాలు కేవలం రుచి కోసమే కాకుండా గ్రహాల నుంచి కలిగే దుష్ప్రభావాల నుంచి కూడా కాపాడతాయట. జాతకరీత్యా మీకున్న గ్రహ దోషాలకు ఆయా గ్రహాలకు ప్రీతికరమైన మసాలా దినుసులతో పరిహారం లభిస్తుందట. ఏయే మసాలాలు ఏ గ్రహాల నుంచి రక్షిస్తాయో తెలుసుకుందాం రండి.

సూర్యుడు: ఎర్ర మిరపకాయలు సూర్యుడికి గ్రహానికి ప్రీతికరమైన మసాలా. రుచికి కారంగా, ఘాటుగా అనిపించే ఎర్ర మిరపకాయలు రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. ఇదే కాకుండా ఎండు మిర్చి, సెనగలు, బెల్లం, అటుకులపై కూడా సూర్యుని నుంచే వచ్చే ప్రతికూలతను తగ్గిస్తాయి.

చంద్రుడు: మంచి సువాసనను వెదజల్లే యాలకులు చంద్రుని ప్రభావం నుంచి కాపాడతాయి. శ్వాస సంబంధిత రోగాలున్న వారు ఇవి తీసుకోవడం మంచిది. దీంతోపాటుగా ఇంగువ కూడా చంద్రునికి ప్రీతికరమైన వస్తువే. గాలిని స్వచ్ఛంగా మార్చి సువాసనను వెదజల్లడంలో సహాయపడుతుంది. కడుపులోని గ్యాస్ ను తగ్గించి జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. చంద్ర గ్రహ దోషాలున్న వీటిని తీసుకుని పరిహారం పొందచ్చు.

కుజుడు: రుచి గ్రంథులను బలపరిచి రక్త సరఫరాను వేగవంతం చేసే ఎర్ర మిరపకాయలు బుధ గ్రహానికి చెందినది. రతన్ జూట్ కూడా బుధ గ్రహానికి సంబంధించినదే. శరీరానికి ధైర్యాన్ని అందించి బలాన్ని సమకూరుస్తుంది. ఇది కాకుండా దాల్చిన చెక్క, ఎర్ర మిర్చి, అల్లం, ఫెనూగ్రీక్, బఠానీలు కూడా బుధ గ్రహానికి చెందినవే.వీటి ద్వారా కుజ దోష సమస్యల నుంచి బయటపడచ్చు.

బుధుడు: ధనియాలు, ఇంగువ, పచ్చ యాలకులు బుధ గ్రహం మెచ్చే మసాలాలు. ధనియాల రసం కిడ్నీలకు, బ్లాడర్ సమస్యలు తీరిస్తే మిగిలినవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటి ద్వారా బుధ గ్రహదోషాల నుంచి ఉపశమనం పొందచ్చు.

గురుడు: యాంటీ బయాటిక్ లక్షణాలకు ప్రసిద్ధి గాంచిన పసుపు గాయాలను నయం చేస్తుంది. బెంగాల్ గ్రామ్, బార్లీ గింజలు, ఆవాలు కూడా గురు గ్రహానికి ప్రీతికరమైనవి.

శుక్రుడు: జీలకర్ర ఒంటికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎసిడిటీ సమస్యలను దూరం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. ఒకవేళ మనకు ఈ సమస్య ఉందంటే కచ్చితంగా రాహు, కేతు దోషం ఉన్నట్లే అని గుర్తించాలి. ఇదే కాకుండా రాతి ఉప్పు, దాల్చిన చెక్క, చిక్కుడు గింజలు, సోంపు కూడా శుక్రగ్రహ దోషం నుంచి మిమ్మల్ని కాపాడతాయి.

శని: నల్ల మిరియాలు, నల్ల సీసమె విత్తనాలు, తేనె, లవంగాలలో అన్ని శని గ్రహానికి ప్రీతికరమైనవి. నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల దగ్గు దరిచేరదు. అరుగుదల సమస్య ఉండదు.లవంగాలు తరచూ తినడం వల్ల తలనొప్పి సమస్య, పంటి నొప్పులు దూరమవుతాయి. శనిగ్రహం అనుకూలత కూడా ఉంటుంది.

రాహు: బంగ్లాకు లేదా పలావు ఆకు అంటుంటారు. ఇదేగాకుండా జాజికాయ కూడా రాహు గ్రహానికి చెందినదే. దీనిని తీసుకోవడం వల్ల వంటల్లో సువాసనను చేర్చడంతో పాటు చర్మవ్యాధులు రాకుండా చేస్తుంది. చాలా జబ్బులను నయం చేయడానికి ప్రయోజనకారిగా కూడా పని చేస్తుంది. వీటితో పాటుగా రాహు కేతువులు కలిసి వెల్లుల్లి, మినుములు, చిక్కుడు గింజలు రాహు కేతువుల అనుగ్రహం పొందేందుకు సహాయపడతాయి.

కేతు: జీర్ణ వ్యవస్థపై యాంటీ గ్యాస్ ప్రభావం చూపించే కొత్తిమీర కాడలు కేతు గ్రహానికి అనుకూలంగా వ్యవహరిస్తాయి. వీటిని నల్ల ఉప్పులో కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్య తీరిపోతుంది. ఇదేగాకుండా చింతపండు, మామిడి పొడి, నువ్వులు కూడా కేతు గ్రహ పరిహారానికి సహాయపడతాయి.

గ్రహాల ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకండి. సమయానికి అనుగుణంగా, సీజన్‌ను బట్టి ఇవి తీసుకోవాలని మర్చిపోకండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.