Bad luck: ఈ రంగు పాదరక్షలు లేదా బూట్లు ధరించారంటే దురదృష్టం వెంటాడుతుంది జాగ్రత్త-beware of bad luck if you wear shoes or boots of this color ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bad Luck: ఈ రంగు పాదరక్షలు లేదా బూట్లు ధరించారంటే దురదృష్టం వెంటాడుతుంది జాగ్రత్త

Bad luck: ఈ రంగు పాదరక్షలు లేదా బూట్లు ధరించారంటే దురదృష్టం వెంటాడుతుంది జాగ్రత్త

Gunti Soundarya HT Telugu
Sep 30, 2024 06:34 PM IST

Bad luck: రంగు రంగుల బూట్లు ధరించడం ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ అందరికీ అన్ని రకాల రంగుల పాదరక్షలు సరిపోవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని రంగుల బూట్లు ధరించడం వల్ల దురదృష్టం వెంటాడుతుందట. అవి ఏ రంగులో తెలుసుకోండి.

ఈ రంగు బూట్లు దురదృష్టం ఇస్తాయి
ఈ రంగు బూట్లు దురదృష్టం ఇస్తాయి (pixabay)

Bad luck: అమ్మాయిలు అయితే కాళ్ళకు ధరించే చెప్పుల విషయంలో కూడా స్టైల్ చూస్తారు. అదే అబ్బాయిలు అయితే బ్లాక్, బ్లూ వంటి రంగుల్లోని చెప్పులే ఎక్కువగా ఉపయోగిస్తారు. అమ్మాయిలు మాత్రం డ్రెస్ కి నప్పే విధంగా రంగు రంగుల చెప్పులు కొని పెట్టేసుకుంటారు.

మీకు తెలుసా కొన్ని రంగుల చెప్పులు ధరించడం దురదృష్టాన్ని ఇస్తుందని. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తాయట. ఇది ఒకటి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సంబంధం, కెరీర్, మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఇది వారి జీవితంలో ఆనందాన్ని హరించివేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎటువంటి రంగుల పాదరక్షలు ధరించకూడదు. వాటి వల్ల కలిగే అనార్థాలు ఏంటో తెలుసుకుందాం.

ఎరుపు

కర్కాటకం, సింహం, వృశ్చిక రాశుల వాళ్ళు ఎరుపు రంగు పాదరక్షలు ధరించడం అశుభంగా పరిగణిస్తారు. ఇవి ప్రతికూల దృష్టిని ఆకర్షిస్తాయి. ఒత్తిడిని పెంచుతుంది. సంబంధాలకు అంతరాయం కలిగిస్తుంది. విశ్వాసం, శక్తిని ప్రేరేపిస్తుంది. అందుకే ఈ రాశుల వాళ్ళు ఎరుపు రంగు బూట్లు చెప్పులు ధరించకపోవడమే ఉత్తమం.

బ్రైట్ గ్రీన్/ నియాన్

నియాన్ లేదా ప్రకాశవంతమైన ఆకుపచ్చ బూట్లు కేతువుతో అనుసంధానించబడి ఉంటాయి. మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది. అనూహ్య సంఘటనలు ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మిక వృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. మనసును గందరగోళానికి గురి చేస్తుంది. అందుకే ఈ రంగు పాదరక్షలు పూర్తిగా నివారించడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. బదులుగా ప్రశాంతమైన రంగులు ఎంచుకోవడం మంచిది.

పసుపు

జ్యోతిష్యశాస్త్రంలో పసుపు బూట్లు బృహస్పతి ప్రతికూల ప్రభావాలతో సంబంధం కలిగి ఉన్నందున ఇవి అశుభమైనవిగా పరిగణిస్తారు. ఈ రంగు పాదరక్షలు ధరించడం వల్ల అనవరమైన వివాదాలు, చట్టపరమైన సమస్యలు, ఆర్థిక సమస్యల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పసుపు జ్ఞానాన్ని సూచిస్తుంది. కానీ అధికంగా ధరిస్తే మాత్రం అహంకారం, ఉద్రేకానికి దారి తీస్తుంది. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నవాళ్ళు వీటి జోలికి అసలు పోకూడదని పండితులు సూచిస్తున్నారు. బదులుగా తటస్థ రంగులు ఎంచుకోవడం ఉత్తమం.

గ్రే కలర్

గ్రే కలర్ బూట్లు రాహువుతో సంబంధం కలిగి ఉంటాయి. గందరగోళం, అనిశ్చితికి కారణమవుతాయి. ఇతరులతో విభేదాలు కలిగిస్తుంది. మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. వీటిని చాలా తక్కువగా ధరించాలి. కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బూడిద రంగు బూట్లు స్పష్టత లేకపోవడాన్ని సూచిస్తాయి. పురోగతి, పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి.

ముదురు నీలం

ముదురు నీలం రంగు పాదరక్షలు శనితో ముడిపడి ఉన్న రంగు. నిరాశ, విచారం, ఒంటరితనం కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అధ్యాత్మికంగా ఎదగలేరు. అందుకే వాటిని తక్కువగా ధరించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. భావోద్వేగా గందరగోళాన్ని సృష్టిస్తాయి. అందుకే వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండమే మంచిది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

టాపిక్