Durga devi: ఈ ఆలయంలో అమ్మవారికి చెప్పులు, బూట్లు విరాళాలు - ఎందుకో తెలుసా?
Durga devi: సాధారణంగా ఆలయంలో దేవుళ్ళకు ఖరీదైన ఆభరణాలు, తమకు తోచినంత డబ్బు విరాళంగా ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం కాళ్ళకు వేసుకునే చెప్పులు, బూట్లు వంటివి అమ్మవారికి సమర్పిస్తారు. అలా ఎందుకు చేస్తారు? ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.
Durga devi: మనదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆలయాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలాగే దేవాలయాల్లో సమర్పించే నైవేద్యం కూడా విభిన్నంగా ఉంటుంది.

సాధారణంగా ఆలయాలకు వెళ్లినప్పుడు భక్తులు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు తమకు తోచిన విధంగా వస్తువులు సమర్పిస్తూ ఉంటారు. దేవుడు తమకు ఇచ్చిన దాంట్లో కొంత భాగం అంటూ తన స్తోమతకు తగినట్టు కొబ్బరికాయలు, పువ్వులు, డబ్బులు విరాళాలుగా సమర్పిస్తారు. అలాగే ఇంకొంతమంది వెండి, బంగారు ఆభరణాలు, మరెన్నో విలువైన వస్తువులు సమర్పిస్తారు.
కానీ ఇక్కడ ఆలయంలో మాత్రం దేవతకు సమర్పించేవి ఏంటో తెలిస్తే మీరు నోరెళ్ళ పెట్టాల్సిందే. మామూలుగా దేవాలయంలోకి ప్రవేశించక ముందే గుడి బయటి మెట్ల దగ్గర పాదరక్షలు, బూట్లు వదిలేసి వెళ్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం పాదరక్షలు విరాళంగా సమర్పిస్తారు. ఆ గుడి ఎక్కడ ఉంది దాని గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
సిద్ధిధాత్రి ఆలయం
మధ్యప్రదేశ్ లోని నాగ్ పూర్ పహాడీ మాతా మందిరంలో చెప్పులు, బూట్లు వంటి వాటిని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఆలయం చాలా ఎత్తులో ఉంటుంది. భక్తులు ఆలయానికి చేరుకోవాలి అంటే 250 మెట్లు ఎక్కాలి. అప్పుడే అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతారు. ఈ ఆలయంలో దుర్గామాత తొమ్మిది రూపాలలో ఒకటైన మాసిద్ధి ధాత్రికి అంకితం చేసినది.
హిందూ విశ్వాసాల ప్రకారం మా సిద్ధిధాత్రికి అసాధారణ శక్తులు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. కోరికలు నెరవేరుస్తుందని, భక్తులను రక్షిస్తుందని, ప్రేమగల దేవతగా నమ్ముతారు. మా సిద్ధిధాత్రి దుర్గాదేవి తొమ్మిదవ రూపం. కమలంపై కూర్చొని నాలుగు చేతులతో ఉంటుంది. శంఖం,గదా, చక్రం, కమలం పట్టుకొని కనిపిస్తుంది.
కాళ్ళు కందకుండా చెప్పులు
ఈ పహాడీ మాతా మందిరంలో మా సిద్ధిధాత్రిని కేవలం శక్తివంతమైన దేవతగా మాత్రమే కాకుండా చిన్న పిల్లగా కూడా పూజిస్తారు. స్వచ్ఛత, అమాయకత్వం, దైవత్వంతో నిండినట్లుగా సిద్ధిధాత్రి భక్తులకు దర్శనం ఇస్తుంది. చిన్నపిల్లలకు చెప్పులు, పాదరక్షలు బహుమతిగా ఇచ్చినట్లే ఇక్కడ అమ్మ వారి పట్ల తమకున్న ప్రేమ, ఆరాధన, భక్తిని వ్యక్తం చేస్తూ వాటిని సమర్పిస్తారు.
చెప్పులు సమర్పించడం అనేది బాల రూపంలో ఉన్న దేవత సౌలభ్యం శ్రేయస్సు కోసం ఇస్తున్నట్టు నమ్ముతారు. తల్లితండ్రులు తమ పిల్లలు కఠినమైన రోడ్లమీద నడవడానికి ఇబ్బంది పడతారని పాదరక్షలు అందిస్తారు. అలా భక్తులు కూడా సిద్ధిధాత్రికి చెప్పులు సమర్పిస్తారు. ఆమె తన భక్తులను ఆశీర్వదించడానికి పహాడీ నుంచి దిగినప్పుడు ఆమె పాదాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు ఈ విధంగా చెప్పులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
అనాథలు పంచుతారు
ఈ ఆలయంలో అమ్మవారికి వచ్చిన చెప్పులు, బూట్లు, పాదరక్షలు అనాథ శరణాలయాలకు, చిన్నపిల్లలకు పంచి పెడతారు. చెప్పులు లేకుండా నడుస్తున్న వారికి వాటిని అందజేస్తారు. కొంతమంది భక్తులు రెండు జతల పాదరక్షలు కూడా కొంటారు. ఒకటి సిద్ధిధాత్రికి సమర్పిస్తే మరొకటి ఆమె ఆశీర్వాదంతో మరొకరికి దానం చేస్తారు. బాల్య రూపంలో ఉన్న మా సిద్ధిధాత్రితో భక్తులకు ఉన్న అనుబంధం కారణంగా చెప్పులు, అద్దాలు సమర్పించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది.
సుమారు 30 సంవత్సరాల క్రితం ఈ మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి మా సిద్ధిధాత్రిని తన బిడ్డగా భావించి పూజలు నిర్వహించారని చెబుతారు. అలాగే ఈ ఆలయంలో సిద్ధిధాత్రికి రోజులో ఐదు నుంచి పది సార్లు వస్త్రాలు మారుస్తారని కూడా చెబుతారు. ఎందుకంటే అమ్మవారికి ఒకటే వస్త్రం వేసుకోవడం ఇష్టం ఉండదని పూజారి ఎప్పటికప్పుడు వాటిని మారుస్తూ ఉంటాడట.
టాపిక్