WTC Points Table: అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్ ఎన్నో ప్లేస్ అంటే..-wtc points table 2023 25 india consolidate number 1 spot in world test championship standings ind vs eng cricket news ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Wtc Points Table: అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్ ఎన్నో ప్లేస్ అంటే..

WTC Points Table: అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్ ఎన్నో ప్లేస్ అంటే..

Mar 09, 2024, 09:46 PM IST Chatakonda Krishna Prakash
Mar 09, 2024, 09:41 PM , IST

  • WTC Points Table 2023-25: ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) 2023-25 పాయింట్ల పట్టికలో టీమిండియా టాప్ ప్లేస్‍ను మరింత పదిలం అయింది. ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍ను 4-1తో గెలిచిన భారత్.. నంబర్ వన్ ప్లేస్‍లో కొనసాగింది.

స్వదేశంలో ఐదు టెస్టుల సిరీస్‍లో ఇంగ్లండ్‍ను 4-1తో చిత్తు చేసింది టీమిండియా. ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలిచి సత్తాచాటింది.

(1 / 6)

ఇంగ్లండ్‍పై ఐదో టెస్టును కూడా గెలిచి ప్రపంచ టెస్టు చాంపియన్‍షిప్ (WTC) 2023-25 సైకిల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది టీమిండియా. ఈ సైకిల్‍లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‍ల్లో ఆరు విజయాలు, రెండు ఓడములు, ఓ డ్రా సాధించింది భారత్. దీంతో ప్రస్తుతం 68.51 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో టాప్‍లో ఉంది. 

(2 / 6)

భారత్ చేతిలో ఓటమి తర్వాత ఇంగ్లండ్ మరింత కష్టాల్లో పడింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‍లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‍ల్లో మూడు గెలుపులు, ఆరు ఓటములు, ఓ డ్రాతో పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ప్రస్తుతం 17.5 గెలుపు శాతంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఇంగ్లండ్ ఉంది. డబ్ల్యూటీసీలో తొమ్మిది జట్లు ఉండగా.. శ్రీలంక మాత్రమే ఇంగ్లిష్ జట్టు కింద ఉంది. 

(3 / 6)

ఈ డబ్ల్యూటీసీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‍ల్లో మూడు గెలిచి, రెండింట ఓడింది న్యూజిలాండ్. 60 శాతంతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‍లో ఉంది. 

(4 / 6)

ఇప్పటి వరకు 11 టెస్టుల్లో ఏడు గెలుపులు, మూడు పరాజయాలు, ఓ డ్రాతో ఆస్ట్రేలియా ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2023-25 పట్టికలో మూడో ప్లేస్‍లో ఉంది. ప్రస్తుతం ఆసీస్ 59.09 గెలుపు శాతంతో ఉంది. 

(5 / 6)

డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం బంగ్లాదేశ్ (50 శాతం), పాకిస్థాన్ (36.66 శాతం), వెస్టిండీస్ (33.33 శాతం), దక్షిణాఫ్రికా (25 శాతం) వరుసగా నాలుగు, ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు