Benefits of hugging: కౌగిలించుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి..
Benefits of hugging: ప్రేమను వ్యక్తపర్చడానికి కౌగిలింతకు మించిన మార్గం లేదు. ఆత్మీయులను కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ అనే హర్మోన్ విడుదల అవుతుంది.
(1 / 7)
ప్రేమ, ఆప్యాయత మరియు నేనున్నాననే భావనను వ్యక్తీకరించే అత్యంత అందమైన మార్గాలలో ఒకటి కౌగిలింత. ఆత్మీయుల మధ్య కౌగిలింతలు అత్యంత సాధారణం. కౌగిలించుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని సైన్స్ కూడా చెబుతోంది. ప్రేమగా కౌగిలించుకోవడంతో మనస్సు ప్రశాంతమవుతుంది. (Unsplash)
(2 / 7)
ఆత్మీయ ఆలింగనం వల్ల గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. స్ట్రెస్, టెన్షన్ తగ్గి, ప్రశాంతంగా మారుతారు. (Unsplash)
(3 / 7)
కౌగిలించుకున్నప్పుడు శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. అది మానసిక, శారీరక బాధల నుంచి ఉపశమనం ఇస్తుంది.(Unsplash)
(4 / 7)
కౌగిలింత ఒక రకమైన భద్రతాభావనను ఇస్తుంది. ఆ వ్యక్తి సమక్షంలో నేను సేఫ్ అనే భావనను కలగజేస్తుంది. (Unsplash)
(5 / 7)
ఆలింగనం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మనస్పర్థలను దూరం చేస్తుంది. దగ్గరితనాన్ని పెంచుతుంది.(Unsplash)
(6 / 7)
ఆత్మీయ ఆలింగనంతో ఒంటరితనం దూరం అవుతుంది. నా కోసం మరొకరు ఉన్నారన్న భావన కలుగుతుంది. ఇష్టమైన వ్యక్తి నుంచి వచ్చిన కౌగిలింత క్షణాల్లో భద్రతా భావనను కలగజేస్తుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు