Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే-vizag colony is a tourism spot near nagarjuna sagar project read full details are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే

Telangana Tourism : చుట్టు కొండలు, ఆపై సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - హైదరాబాద్ కు పక్కనే ఉండే 'వైజాగ్ కాలనీ' చూడాల్సిందే

Apr 26, 2024, 08:16 PM IST Maheshwaram Mahendra Chary
Apr 26, 2024, 08:16 PM , IST

  • Vizag Colony Tour Spot in Nalgonda : హైదరాబాద్ నగరానికి సమీపంలో ఆహ్లాదకరమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది.  అదే వైజాగ్ కాలనీ. చుట్టు కొండలు, ఆపై సాగర్ అందాలను చూడాలంటే రెండు కళ్లు చాలవేమో అన్నట్లు ఉంటుంది…!

హైదరాబాద్ నగరం నుంచి అతి దగ్గర సమీపంలో ఉంటుంది వైజాగ్ కాలనీ. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండకు సమీపంగా ఈ టూరిజం స్పాట్ ఉంటుంది.

(1 / 5)

నల్గొండ జిల్లా నేరేడిగొమ్ము మండలం ప్రాంతంలో ఈ ప్లేస్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లేటప్పుడు ఈ ప్రాంతం కుడి వైపున ఉంటుంది.  గిరిజన తండాల మీదుగా సాగే ప్రయాణం అద్భూుతంగా ఉంటుంది.

(2 / 5)

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఇక్కడ ఉంటుంది. చుట్టు కొండలు ఉంటాయి. ఓ రకంగా చెప్పాలంటే,,, ఐల్యాండ్ అని అనొచ్చు. ఇక్కడికి టూరిస్టులు చాలా మంది వస్తుంటారు.  

(3 / 5)

వైజాగ్ కాలనీగా పిలవబడే ఈ ప్రాంతంలో…. బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడి రహదారులపై ఆరబోసిన చేపలు కుప్పలుకుప్పలుగా కనిపిస్తుంటాయి. మనకు కావాలంటే… వండి కూడా ఇస్తుంటారు. 

(4 / 5)

సాగర్ హైవేపై ఉండే మల్లేపల్లి నుంచి 32 కి.మీ. దూరంలో ఈ వైజాగ్ కాలనీ ఉంటుంది. ఇక్కడ నైట్ క్యాంపులను కూడా ఏర్పాట్లు చేసుకోవచ్చు. విశాఖ జిల్లా నుంచి వచ్చిన మత్స్యకారులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వీకెండ్ లో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఈ ప్లేస్ ను ఎంచుకోవచ్చు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు