తెలుగు న్యూస్ / ఫోటో /
Vaikunta Ekadasi at Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం - పోటెత్తిన భక్తులు
- Vaikunta Ekadasi at Tirumala 2023: తిరుమలలో అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారిని ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి భక్తులు దర్శించుకుంటున్నారు. తిరువీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
- Vaikunta Ekadasi at Tirumala 2023: తిరుమలలో అర్ధరాత్రి శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. శ్రీవారిని ఉత్తర వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి భక్తులు దర్శించుకుంటున్నారు. తిరువీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.
(1 / 7)
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలోని వైకుంఠ ద్వారం తెరచుకుంది. శనివారం వేకువజామున 1:30 గంటలకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానికి ప్రక్కనే ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. తొలుత ప్రముఖలు, ఆ తర్వాత సామాన్య భక్తులకు ప్రవేశం కల్పించింది.
(2 / 7)
తిరుమలలో ఇవాళ్టి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు.
(3 / 7)
తిరుమలలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి. గోవిందా నామస్మరణలతో తిరువీధులు మారుమోగుతున్నాయి.
(4 / 7)
శ్రీవారి భక్తులను ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు.
(5 / 7)
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి డిసెంబరు 22వ తేదీన సర్వదర్శన టోకెన్లు మంజూరు చేశారు, ఇవాళ ఎలాంటి టోకెన్లు ఇవ్వమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.
(6 / 7)
పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది. వైకుంఠంలో శ్రీమహావిష్ణువుకు ఒక రోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం. అదేవిధంగా అక్కడ పగలు 12 గంటలు ఇక్కడ 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 12 గంటలు ఇక్కడ 6 నెలలు దక్షిణాయణం.
(7 / 7)
వైకుంఠంలో తెల్లవారుజామున 120 నిమిషాలు భూలోకంలో 30 రోజులతో సమానం. దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు, ఋషులకు దర్శనమిస్తారు. ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ. భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది. ఈ 40 నిమిషాలు భూలోకంలో 10 రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాలలో ఈ 10 రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం. కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ 10 రోజులలో ఏరోజు చేసుకున్నా అన్ని రోజులూ సమానమే అని పండితులు చెబుతున్నారు.
ఇతర గ్యాలరీలు