తెలుగు న్యూస్ / ఫోటో /
TS EAPCET 2024 Updates : తెలంగాణ ఎంసెట్ ప్రవేశాల అప్డేట్స్ - కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..?
- TS EAPCET (EAMCET) 2024 Counselling Updates : తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

(1 / 6)
తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. శనివారం(మే 18) రోజు విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు.(Photo Source https://unsplash.com/)
(2 / 6)
ఈ ఏడాది ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. (Photo Source https://unsplash.com/)
(3 / 6)
ఈ ఏడాది 2,40, 618 మంది ఇంజినీరింగ్ పరీక్షలు రాస్తే వీరిలో 1, 80, 424 మంది అర్హతసాధించారు. ఇక అగ్రికల్చర్ విభాగంలో 1,06, 514 మంది పరీక్షలు రాస్తే... 91,935 మంది క్వాలిఫై అయ్యారు.(Photo Source https://unsplash.com/)
(4 / 6)
ఇప్పటికే ఫలితాలు రావటంతో కౌన్సెలింగ్ ప్రక్రియపై ఫోకస్ పెట్టారు అధికారులు. 5- 6 రోజుల్లో ఎప్‌సెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.(Photo Source https://unsplash.com/)
(5 / 6)
కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం…. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు టాప్ కాలేజీల్లో సీట్లు దక్కే అవకాశం ఉంది. పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి ఫలితాల్లోనూ మంచి మార్కులు సాధిస్తే ఐఐటీల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది.(Photo Source https://unsplash.com/)
ఇతర గ్యాలరీలు