తెలుగు న్యూస్ / ఫోటో /
Tirumala : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై యోగనరసింహుడు
- Tirumala : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
- Tirumala : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
(2 / 7)
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై విహరించారు.
(3 / 7)
సింహ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
(5 / 7)
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది.
ఇతర గ్యాలరీలు