CJI Chandrachud Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ చంద్రచూద్, వేద విశ్వవిద్యాలయం సందర్శన-tirumala cji justice chandrachud prays at tirupati visits sv vedic university ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tirumala Cji Justice Chandrachud Prays At Tirupati Visits Sv Vedic University

CJI Chandrachud Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ చంద్రచూద్, వేద విశ్వవిద్యాలయం సందర్శన

Mar 27, 2024, 06:11 PM IST Bandaru Satyaprasad
Mar 27, 2024, 06:11 PM , IST

  • CJI Chandrachud Visits Tirumala : తిరుమల శ్రీవారి సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ వేద పండితులు సీజేఐకు తీర్థప్రసాదాలు అందించారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ బుధ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

(1 / 8)

తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్  సింగ్ ఠాకూర్‌కు టీటీడీ ఆల‌య అర్చకులు సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.

(2 / 8)

శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో  ప్రధాన న్యాయమూర్తుల‌కు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు,  డైరీ, క్యాలెండ‌ర్‌, ఆగ‌ర‌బ‌త్తులు, పంచ‌గ‌వ్య ఉత్పత్తులను అందజేశారు. 

(3 / 8)

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ, వేద విశ్వవిద్యాలయం సంరక్షిస్తూ డిటిలైజేషన్ చేస్తున్న తాళపత్రాలను బుధ‌వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ సందర్శించారు. 

(4 / 8)

ముందుగా విశ్వవిద్యాలయం సంరక్షిస్తున్న వేద, వేదాంగా, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ, దర్శనాలకు సంబంధించిన తాళపత్రాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, వాటి ప్రచురణను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప‌రిశీలించారు.

(5 / 8)

కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, రుషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరచిన రాత ప్రతులను ( మాన్యు స్క్రిప్ట్స్) భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ అన్నారు.

(6 / 8)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మీడియాతో మాట్లాడుతూ... ఇవాళ చాలా సంతోషంగా ఉందన్నారు. అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షిస్తున్నారు. ఇక్కడి పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది, న్యాయ విద్యను ఎలా అభ్యసించేవారు, పురాతన న్యాయ శాస్త్రం లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివ‌రించిన‌ట్లు తెలిపారు.

(7 / 8)

ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశ వ్యాప్తంగా చేయాల‌ని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కోరారు. ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ, పరిశోధన, ప్రచురణ ఫలితాలు  కేవలం భారతదేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయ‌ని తాను దృఢంగా నమ్ముతున్నానన్నారు. టీటీడీ ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపటం, అందులో పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిదన్నారు. వేదమంత్ర పఠనం వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంద‌ని తెలిపారు.

(8 / 8)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు