తెలుగు న్యూస్ / ఫోటో /
Ways to Improve Memory । తల గోక్కోకండి.. జ్ఞాపకశక్తిని పెంచే చిట్కాలు ఇవిగో!
- తులసి విత్తనాల్లో పాలీఫెనాల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించవచ్చు, తద్వారా అభిజ్ఞా క్షీణతను నివారించవచ్చు.
- తులసి విత్తనాల్లో పాలీఫెనాల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించవచ్చు, తద్వారా అభిజ్ఞా క్షీణతను నివారించవచ్చు.
(1 / 10)
మనలో చాలా మంది మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటారు. ఏది వస్తువు ఎక్కడ పెట్టామనేది గుర్తుండదు, చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఈ సంకేతాలు మన జ్ఞాపకశక్తి బలహీనపడినట్లు సూచిస్తాయి. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారి కోసం పోషకాహార నిపుణురాలు అంజలి ముఖర్జీ కొన్ని సూచనలు చేశారు.(Unsplash)
(2 / 10)
బి విటమిన్లు కలిగిన ఆహారం, ముఖ్యంగా విటమిన్ బి12, బి 9 ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.(Unsplash)
(3 / 10)
తులసి విత్తనాలు ఏదో ఒక రూపంలో తింటుండాలి. ఇందులోని ఔషధ గుణాలు నాడీవ్యవస్థను మెరుగుపరుస్తాయి.(Unsplash)
(4 / 10)
జామూన్, అనార్, బ్లాక్ బెర్రీలు, బ్లూ బెర్రీలలో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.(Unsplash)
(5 / 10)
రోజూ ఎనిమిది గంటల నిద్ర ఉండాలి. అలాగే పజిల్స్, పొడుపుకథలు, చదరంగంతో వంటి సాధనలతో మెదడుకు మేత కల్పించి దాని ఆరోగ్యాన్ని పెంచవచ్చు.(Unsplash)
(6 / 10)
విషయాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి మెగ్నీషియం ఒక ముఖ్యమైన పోషకం. ఆకు కూరలు, నట్స్, పాలు వంటి ఆహార పదార్థాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.(Unsplash)
(7 / 10)
ధ్యానం చేయడం ద్వారా మతిమరుపు లాంటి వృద్ధాప్య సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది, ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు