TTD Brahmotsavalu 2024 : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సింహ వాహనంపై మలయప్పస్వామి, ఫొటోలు-the third day sri malayappa as yoga narasimha in the ferocious simha vahana in tirumala brahmotsavalu 2024 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ttd Brahmotsavalu 2024 : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సింహ వాహనంపై మలయప్పస్వామి, ఫొటోలు

TTD Brahmotsavalu 2024 : వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు - సింహ వాహనంపై మలయప్పస్వామి, ఫొటోలు

Oct 06, 2024, 11:39 AM IST Maheshwaram Mahendra Chary
Oct 06, 2024, 11:39 AM , IST

  • Tirumala Brahmotsavalu 2024 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు ఆదివారం ఉదయం సింహ వాహన సేవ నిర్వహించారు. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనిమిచ్చారు. ఫొటోలు ఇక్కడ చూడండి…..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ‌న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

(1 / 6)

వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.

(2 / 6)

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది.

(3 / 6)

సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది.

(4 / 6)

అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

(5 / 6)

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, కేంద్ర సహాయ మంత్రి  శ్రీనివాసవర్మ, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బివిఎల్ ఎన్‌ చ‌క్ర‌వ‌ర్తి, టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు దంప‌తులు, అద‌న‌పు ఈవో  సిహెచ్ వెంక‌య్య చౌద‌రి దంప‌తులు, జేఈవోలతో పాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు