Budameru Flood: బెజవాడను బుడమేరు ముంచెత్తకుండా రైల్వేట్రాక్స్ రక్షణ గోడలయ్యాయి…
- Budameru Flood: విజయవాడలో సగం నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తిన వేళ మిగిలిన ప్రాంతం సురక్షితంగా ఉండటానికి రైల్వే కట్టలే అడ్డుగోడలుగా నిలిచాయి.బుడమేరు వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ముందు చూపుతో చేపట్టిన ఎత్తైన రైల్వేట్రాకులు నగరాన్ని వరద బారిన పడకుండా కాపాడాయి. ఫోటోలు విష్ణుభట్ల జయప్రకాష్
- Budameru Flood: విజయవాడలో సగం నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తిన వేళ మిగిలిన ప్రాంతం సురక్షితంగా ఉండటానికి రైల్వే కట్టలే అడ్డుగోడలుగా నిలిచాయి.బుడమేరు వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ముందు చూపుతో చేపట్టిన ఎత్తైన రైల్వేట్రాకులు నగరాన్ని వరద బారిన పడకుండా కాపాడాయి. ఫోటోలు విష్ణుభట్ల జయప్రకాష్
(1 / 11)
విజయవాడలో లక్షలాది మంది ప్రజలు బడమేరు వరదలో చిక్కుకుని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అందించేందుకు సిద్ధం చేసిన ఆహారం వారికి చేరకుండానే రోడ్డు పాలైంది. లక్షల సంఖ్యలో జనం నిరాశ్రయులై వరదలో ఉంటే, వారికి చేరాల్సిన ఆహారం ఫుట్‌పాత్‌లపై దర్శనం ఇచ్చింది.
(3 / 11)
వరద తీవ్రత తగ్గినా ఇంకా ముంపులోనే చాలా ప్రాంతాలు ఉన్నాయి. సింగ్‌నగర్‌లో నీట మునిగిన రైతు బజారు
(4 / 11)
విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతాన్ని బుడమేరు ముంచెత్తడంతో లక్షలమంది నాలుగో రోజు కూడా ముంపులోనే ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని అంబులెన్సుల్లో ఆస్పత్రికి తరలిస్తున్నారుర.
(6 / 11)
సింగ్‌నగర్ ప్రాంతంలో వరద ముంపు తగ్గు ముఖం పట్టినా ఇంకా చాలా ప్రాంతాలు నీటి ముంపులోనే ఉన్నాయి. మాటలకందని ఆస్తినష్టం వాటిల్లింది. చాలా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు. వేలాది వాహనాలు నీట మునిగిపోయాయి.
(7 / 11)
విజయవాడ నగరంతో సింగ్‌నగర్ ప్రాంతానికి సంబంధాలు తెగిపోవడంతో సహాయ చర్యలు అందడంలో నాలుగు రోజులుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. బాధితులకు బయటకు తీసుకు వచ్చేందుకు సరిపడా సామాగ్రి లేకపోవడంతో నీటిలోనే జనావాసాలు చిక్కుకుపోయాయి. వరద నీరు తగ్గడంతో మృతదేహాలు పెద్ద సంఖ్యలో బయట పడుతున్నాయి.
(9 / 11)
బుడమేరు వరదల కారణంగా పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై మునిగిపోయాయి. వాటిని తొలగించేందుకు క్రేన్లను సిద్ధం చేస్తున్నారు. మంగళవారం ట్రాక్టర్‌లో మహిళ మృతదేహం లభ్యమైంది. వరదలో చిక్కుకుని మరణించినట్టు గుర్తించారు. అజిత్ సింగ్‌నగర్, పాయకాపురం, నందమూరి నగర్, న్యూ రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో లక్షలాది మంది అల్లాడుతున్నారు.
(10 / 11)
వరదల్లో చిక్కుకున్న వారి కోసం తెచ్చిన ఆహారం బాధితులకు చేరడం లేదు. సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలను వదిలేశారు. ప్యాక్ చేసిన ఆహారం నిరుపయోగంగా మారిపోయింది.
ఇతర గ్యాలరీలు