Telangana Tourism : లక్నవరంలో బోటింగ్.. ఖిల్లా వరంగల్, రామప్పతో పాటు యాదాద్రి దర్శనం - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి-telangana tourism operate warangal ramappa heritage tour from hyderabad city full details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Telangana Tourism : లక్నవరంలో బోటింగ్.. ఖిల్లా వరంగల్, రామప్పతో పాటు యాదాద్రి దర్శనం - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

Telangana Tourism : లక్నవరంలో బోటింగ్.. ఖిల్లా వరంగల్, రామప్పతో పాటు యాదాద్రి దర్శనం - ఈ కొత్త టూర్ ప్యాకేజీ చూడండి

Sep 11, 2024, 12:47 PM IST Maheshwaram Mahendra Chary
Sep 11, 2024, 12:46 PM , IST

  • తెలంగాణ టూరిజం మరో కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాలను కవర్ చేసేలా ‘కాకతీయ హెరిటేజ్’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 2 రోజులు టూర్ ఉంటుంది. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, లక్నవరంతో పాటు యాదాద్రి కూడా చూసిరావొచ్చు.

టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం శాఖ. హైదరాబాద్ నుంచి కాకతీ. హెరిటేజ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.రెండు రోజుల టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను పేర్కొంది. 

(1 / 7)

టూరిస్టుల కోసం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం శాఖ. హైదరాబాద్ నుంచి కాకతీ. హెరిటేజ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది.రెండు రోజుల టూర్ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను పేర్కొంది. 

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. ఏసీ మినీ కోచ్ బస్సుల‌ో జర్నీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో వెళ్లొచ్చు. ఈ డేట్స్ ను టూరిజం శాఖ ప్రకటిస్తుంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వివరాలను తెలుసుకోవచ్చు.

(2 / 7)

వీకెండ్ లో ఈ ప్యాకేజీ ఉంటుంది. వివరాలు చూస్తే శనివారం(ఫస్ట్ డే) ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. 8:30గంటలకు భువనగిరి ఫోర్టకు చేరుకుంటారు. టిఫిన్ తర్వాత 9:45 AM గంటలకు యాదాద్రి దర్శనం ఉంటుంది.  11:30 గంటలకు  జైన్ ఆలయాన్ని సందర్శిస్తారు. 

(3 / 7)

మధ్యాహ్నం 12:00 గంటలకు పెంబర్తిలో షాపింగ్ ఉంటుంది. 1:30 PMకు వరంగల్ హరిత కాకతీయ హోటల్ కు వస్తారు. లంచ్ తర్వాత  వేయి స్తంభాల ఆలయానికి వెళ్తారు. వరంగల్ ఫోర్టులోని లైట్ ప్రదర్శనను వీక్షిస్తారు. రాత్రి వరంగల్ లోనే బస చేస్తారు.

(4 / 7)

మధ్యాహ్నం 12:00 గంటలకు పెంబర్తిలో షాపింగ్ ఉంటుంది. 1:30 PMకు వరంగల్ హరిత కాకతీయ హోటల్ కు వస్తారు. లంచ్ తర్వాత  వేయి స్తంభాల ఆలయానికి వెళ్తారు. వరంగల్ ఫోర్టులోని లైట్ ప్రదర్శనను వీక్షిస్తారు. రాత్రి వరంగల్ లోనే బస చేస్తారు.(Image Source YTDA Website)

రెండో రోజు (ఆదివారం) రామప్పకు వెళ్తారు.  మధ్యాహ్నం 2 గంటలకు లక్నవరం వెళ్తారు.లక్నవరం నుంచి బయల్దేరుతారు. బోటింగ్, లంచ్ ఉంటుంది. అక్కడ్నుంచి హన్మకొండలోని హరిత హోటల్ కి వస్తారు. టీ విరామం ఉంటుంది. 5:30 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

(5 / 7)

రెండో రోజు (ఆదివారం) రామప్పకు వెళ్తారు.  మధ్యాహ్నం 2 గంటలకు లక్నవరం వెళ్తారు.లక్నవరం నుంచి బయల్దేరుతారు. బోటింగ్, లంచ్ ఉంటుంది. అక్కడ్నుంచి హన్మకొండలోని హరిత హోటల్ కి వస్తారు. టీ విరామం ఉంటుంది. 5:30 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.(Image Source TG Tourism Website )

ఈ ప్యాకేజీ ధరలను చూస్తే  పెద్ద‌ల‌కు రూ. 3449 గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2759గా నిర్ణ‌యించారు. ఈ ధరలో దర్శనంతో పాటు హోట‌ల్ లో వసతి కూడా కల్పిస్తారు. 

(6 / 7)

ఈ ప్యాకేజీ ధరలను చూస్తే  పెద్ద‌ల‌కు రూ. 3449 గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2759గా నిర్ణ‌యించారు. ఈ ధరలో దర్శనంతో పాటు హోట‌ల్ లో వసతి కూడా కల్పిస్తారు. (Image Source TG Tourism Twitter )

హైదరాబాద్ - కాకతీయ హెరిటేజ్ టూర్ బుకింగ్ లింక్ :  https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=260&journeyDate=2024-09-14&adults=2&childs=0 

(7 / 7)

హైదరాబాద్ - కాకతీయ హెరిటేజ్ టూర్ బుకింగ్ లింక్ :  https://tourism.telangana.gov.in/toursList?type=Road&groupCode=2&serviceCode=260&journeyDate=2024-09-14&adults=2&childs=0 (Image Source TG Tourism Website )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు