Rythu Bima Scheme : రైతు బీమా ఇకపై మరింత వేగంగా..! త్వరలోనే ప్రత్యేక యాప్, వీటిని తెలుసుకోండి
- TG Rythu Bima Scheme App : తెలంగాణలోని అన్నదాతలకు వ్యవసాయశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైతు బీమా కోసం ప్రత్యేకంగా యాప్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. స్కీమ్ లో పేరు నమోదు చేసుకోవటం, తప్పుల సవరణతో పాటు మరిన్ని ఇబ్బందులను పరిష్కరించే దిశగా ఈ యాప్ ను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్య వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

(1 / 6)
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అన్నదాతల కోసం తీసుకువచ్చిన రైతుబీమా స్కీమ్ కు సంబంధించి కీలక మార్పులు తీసుకురాబోతుంది.
(2 / 6)
'రైతుబీమా పథకం కోసం మొబైల్ యాప్‌ను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పరిష్కరించటమే లక్ష్యంగా ఈ యాప్ ను తీసుకురాబోతుంది.
(3 / 6)
ఈ పథకం కోసం LICకి పదేళ్లుగా రైతుల ప్రీమియాన్ని తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తోంది. రూ. 5 లక్షల బీమా ఉంటుంది. అయితే ప్రతి ఏడాది ఈ స్కీమ్ అమలులో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతికపరమైన అంశాలు తెరపైకి వస్తున్నాయి.
(4 / 6)
వయోపరిమితి సమస్య ప్రధానంగా ఉంటుంది. దీనికి తోడు ఆధార్‌లో తప్పులు, నామినీ పేర్లు సరిగా నమోదు కాకపోవడం, మరణ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందకపోవడంతో పాటు పలు కారణాల వల్ల రైతు కుటుంబాలకు సాయం అందడం లేదు.
(5 / 6)
కొత్త రైతుల పేర్ల నమోదులోనూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. క్షేత్రస్థాయిలోని సమస్యలను తెలుసుకున్న వ్యవసాయశాఖ… ఈ స్కీమ్ ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా యాప్ అవసరమని వ్యవసాయ శాఖ గుర్తించింది. అధికారుల సూచనలకు అనుగుణంగా దీన్ని రూపొందిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు