తెలుగు న్యూస్ / ఫోటో /
Skin Care Tips : ఇంట్లో ఉన్నా.. వర్షాకాలం అయినా.. సన్‌స్క్రీన్‌ను అప్లై చేయండి..
- సన్‌స్క్రీన్‌ను ఏడాది పొడవునా వాడాలి అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఇంట్లో ఉన్నా కూడా.. సన్‌స్క్రీన్ వాడాలని సూచిస్తున్నారు. స్కిన్ టాన్ రాకుండా ఉండాలంటే.. కచ్చితంగా సన్‌స్క్రీన్ వాడాలి అంటున్నారు.
- సన్‌స్క్రీన్‌ను ఏడాది పొడవునా వాడాలి అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఇంట్లో ఉన్నా కూడా.. సన్‌స్క్రీన్ వాడాలని సూచిస్తున్నారు. స్కిన్ టాన్ రాకుండా ఉండాలంటే.. కచ్చితంగా సన్‌స్క్రీన్ వాడాలి అంటున్నారు.
(1 / 6)
మనలో చాలా మంది టాన్ గురించి ఫిర్యాదు చేస్తారు. సన్‌స్క్రీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడమే దీనికి ఒక కారణం. ఇంట్లోనే ఉన్నామని లేదా.. అలవాటు లేదని సన్ స్క్రీన్ వాడటం మానేస్తే.. చర్మానికి అస్సలు మంచిది కాదు. కాబట్టి బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా.. సన్‌స్క్రీన్ ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 6)
UVA, UVB ఇంటి కిటికీల ద్వారా స్వేచ్ఛగా ప్రయాణించగలవు. ఈ UV అంటే అల్ట్రా వైలెట్ సన్ టాన్. ఇది చర్మంపై ముడతలు, మచ్చలకు బాధ్యత వహిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ అప్లై చేయండి.
(3 / 6)
సన్‌స్క్రీన్ అప్లై చేయడానికి ముందు.. మీ ముఖాన్ని బాగా కడుక్కోండి. మాయిశ్చరైజర్ అప్లై చేయండి. బయటికి వెళ్లడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ ఉపయోగించండి. మీకు ఎక్కువ చెమట పట్టినట్లయితే వాటర్‌ప్రూఫ్ సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
(4 / 6)
ఉదయం పూట సన్‌స్క్రీన్ రాసుకుని రోజంతా బయట తిరగకండి. దీనిని ప్రతి 3-4 గంటలకు ఒకసారి ముఖం మీద అప్లై చేయాలి. ఈ సందర్భంలో మీరు కావాలనుకుంటే స్ప్రే సన్‌స్క్రీన్‌ని ఉపయోగించవచ్చు. అప్పుడు బయట ప్రత్యేకంగా ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు.
(5 / 6)
సన్‌స్క్రీన్‌లో ఎక్కువ SPF ఉంటే.. రక్షణ ఎక్కువ. మీకు ఫెయిర్ స్కిన్ ఉంటే.. కనీసం SPF 40 ఉన్న సన్‌స్క్రీన్‌ని కొనుగోలు చేయండి. గోధుమ రంగులో ఉంటే.. SPF 30 పని చేస్తుంది.
ఇతర గ్యాలరీలు