తెలుగు న్యూస్ / ఫోటో /
Sreeleela: ఎట్టకేలకు శ్రీలీలకు తెలుగులో ఛాన్స్ - మాస్ మహారాజాతో సెకండ్‌టైమ్ రొమాన్స్
ఒకేసారి ఆరు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది శ్రీలీల. కానీ కథల ఎంపికలో పొరపాట్ల కారణంగా ఒకటి, రెండు మినహా శ్రీలీల నటించిన ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్‌సింగ్ మినహా శ్రీలీల చేతిలో ఒక్క తెలుగు మూవీ లేదు.
(1 / 5)
లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో శ్రీలీల ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. రవితేజ తో సెకండ్ టైమ్ శ్రీలీల రొమాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.
(2 / 5)
రవితేజ హీరోగా భానుబోగవరపు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రాబోతోంది. రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న 75వ మూవీ ఇది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
(3 / 5)
రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో 2022లో వచ్చిన ధమాకా మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. శ్రీలీల కెరీర్‌లో ఫస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
(4 / 5)
గత ఏడాది శ్రీలీల నాలుగు సినిమాలు చేసింది. అందులో భగవంత్ కేసరి మినహా ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
ఇతర గ్యాలరీలు