తెలుగు న్యూస్ / ఫోటో /
Abusive Parenting | పిల్లల భావోద్వేగాలతో పేరేంట్స్ ఆటలాడొద్దు!
- పిల్లలపై కొంతమంది తల్లిదండ్రుల తీరు చాలా దారుణంగా ఉంటుంది. విపరీత పదజాలం ఉపయోగించడం, నిందించడం, భయపెట్టడం, అవమానాలకు గురిచేసేలా ప్రవర్తించడం లాంటివి లేతమనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ భావోద్వేగపు గాయం వారిలో ఎప్పటికీ మానదు.
- పిల్లలపై కొంతమంది తల్లిదండ్రుల తీరు చాలా దారుణంగా ఉంటుంది. విపరీత పదజాలం ఉపయోగించడం, నిందించడం, భయపెట్టడం, అవమానాలకు గురిచేసేలా ప్రవర్తించడం లాంటివి లేతమనసులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ భావోద్వేగపు గాయం వారిలో ఎప్పటికీ మానదు.
(1 / 7)
పసి వయసులోనే పేరేంట్స్ వారి పిల్లలను మానసిక వేధింపులకు గురిచేస్తే వాటి పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు. వారు పెరిగేకొద్దీ అవి వారి ప్రవర్తనలోనూ మార్పు తీసుకొస్తాయి. వెల్‌నెస్ నిపుణురాలు కరిష్మా పిల్లలపై మానసిక వేధింపుల గురించి చర్చించారు.(Pexels)
(2 / 7)
తల్లిదండ్రులు వారి పిల్లలను మానసిక వేధింపులకు గురిచేస్తే ఆ చిన్నతనంలో వారికి అర్థం కాకపోవచ్చు. కానీ వారు పెరిగేకొద్దీ వారితో పేరేంట్స్ ఎలా ప్రవర్తించేవారని అర్థం చేసుకుంటారు. దీంతో తల్లిదండ్రులకు, వారి పిల్లలకు మధ్య ఉన్న బంధం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.(Pixabay)
(3 / 7)
పిల్లలను నియంత్రించేందుకు కొంతమంది పేరేంట్స్ నేను మీకోసం ఎంత చేస్తున్నాను అయినా నువ్వు నన్ను ప్రేమించవా? అంటూ పిల్లలను భావోద్వేగంతో గందరగోళానికి గురిచేయడం చెడు సంకేతం.(Pexels)
(4 / 7)
పిల్లలు ఏదైనా విషయంలో బాధపడుతుంటే పేరేంట్స్ దాని గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, వారు పెరిగిన తర్వాత ఒకానొక సందర్భం వస్తే మీతో బంధం తెంచుకోగలరు. (Pexels)
(5 / 7)
తల్లిదండ్రులు వేరొకరి ముందు తమ పిల్లలను అవమానించడం చేత వారు నిజంగా కుంగిపోతారు. ఇది వారిపై భావోద్వేగపూరితమైన దాడి చేస్తుంది.(Pexels)
(6 / 7)
వారిలా ఉండాలి, వీరిలా తయారవ్వాలి, ఇంకొకరిలా చదువుకోవాలి. ఇలా పిల్లలపై తల్లిదండ్రులు తరచూ చేస్తుంటారు. అది ఆ సమయంలో వారి తలకు మించిన అంచనాలు ఏర్పరచడం లాంటిది. దీంతో పిల్లలు ఆత్మన్యూనతకు లోనవుతారు. వారిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది.(Pexels)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు