తెలుగు న్యూస్ / ఫోటో /
పిల్లలు బొద్దుగా తయారవుతునారా? బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని ఇలా నివారించండి!
- కరోనా కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చాయి. చాలా మంది పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఆటలు ఆడటం మరిచిపోయి, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి అలవాట్లు వారి అనారోగ్యానికి కారణం అవుతూ కొన్నిసార్లు ఊబకాయానికి దారితీస్తున్నాయి.
- కరోనా కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చాయి. చాలా మంది పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఆటలు ఆడటం మరిచిపోయి, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇలాంటి అలవాట్లు వారి అనారోగ్యానికి కారణం అవుతూ కొన్నిసార్లు ఊబకాయానికి దారితీస్తున్నాయి.
(1 / 7)
బాల్యంలో వచ్చే స్థూలకాయాన్ని నివారించడానికి, పిల్లలు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ శ్వేతా బుడియాల్ కొన్ని చిట్కాలు అందిస్తున్నారు.(Shutterstock)
(2 / 7)
పిల్లల సరైన ఎదుగుదలకు పోషకాహారం ఎంతో ముఖ్యం. కాబట్టి పిల్లలు ఏది పడితే అది తినకుండా వారికి సరైన మోతాదులో సరైన ఆహారాన్ని అందించాలి. ఆహారంతో పాటు ప్రతిరోజూ వారికి కొంత శారీరక శ్రమ కల్పించాలి.(Shutterstock)
(3 / 7)
పిల్లలు ఎక్కువ బరువు పెరిగిపోతున్నారని ఆందోళన చెందకుండా వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బరువు పెరిగినా ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ముఖ్యం. పనులు చేయడానికి పిల్లలు ఇష్టపడకపోతే వారికి నచ్చజెప్పి మరీ కొంతమేర శారీరక శ్రమ కల్పించడం, చురుగ్గా ఉండేలా చూసుకోవడం అవసరం.(Shutterstock)
(4 / 7)
పిల్లలు అధిక బరువు పెరుగుతున్నారని వారి కోసం ప్రత్యేక ఆహారం అంటూ ఏర్పాటు చేయకుండా, మొత్తం కుటుంబం అంతా కలిసి ఆరోగ్యకరమైన ఆహరపు అలవాట్లను అలవర్చుకోవాలి. అప్పుడే పిల్లలు మాట వింటారు. తమ చుట్టూ ఉన్నవాళ్ల నుంచే పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకుంటారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.(Pixabay)
(5 / 7)
మీ వంటగదిలో, రిఫ్రిజరేటర్‌లో తాజా పండ్లు, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలనే నిల్వచేయండి. రోజూ అల్పాహారంగా ఏది తీసుకోవాలి, భోజనంలో ఏది తీసుకోవాలి, సాయంత్రం స్నాక్స్‌గా ఏం తీసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టండి. పిల్లలు మెల్లిమెల్లిగా దానిని అనుసరించడం మొదలుపెడతారు.(Pixabay)
(6 / 7)
పిల్లలు వారంతటే వారే ఏదైనా తినడానికి ఆసక్తి చూపాలి. అంతేగానీ వారికి ఆకలిగా లేకపోయినా ఏదో ఒకటి తినిపిస్తూ బలవంతం చేయొద్దు. వారు ఎంతవరకైతే తినగలుగుతారో అది వారికే వదిలేయండి. ఎక్కువ తినమని లేదా తక్కువ తినమని ఎప్పుడూ ప్రోత్సహించవద్దు.(Pixabay)
ఇతర గ్యాలరీలు