తెలుగు న్యూస్ / ఫోటో /
2025లో ఈ మూడు రాశులపై ఏలినాటి శని ప్రభావం.. కొంత మంచి, కొంత చెడు!
- Saturn Transit : జ్యోతిషశాస్త్రంలో శని దేవుడు నైతికత, న్యాయ దేవుడుగా చెబుతారు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారి జీవితంలో శని ప్రభావం ఉంటుంది. 2025లో ఏ రాశులవారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో చూద్దాం..
- Saturn Transit : జ్యోతిషశాస్త్రంలో శని దేవుడు నైతికత, న్యాయ దేవుడుగా చెబుతారు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల వారి జీవితంలో శని ప్రభావం ఉంటుంది. 2025లో ఏ రాశులవారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో చూద్దాం..
(1 / 5)
శని సంచారంతో కొన్ని రాశులకు శని ఏడున్నర నుండి ప్రారంభమవుతుంది. శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. 2025 సంవత్సరంలో శని దేవుడు రాశిని మారుస్తాడు. అంటే 2025లో శని సంచారం జరుగుతుంది. ఈ సంచార సమయంలో శనిగ్రహం కుంభరాశి నుండి మీనరాశికి వెళుతుంది.
(2 / 5)
శనీశ్వరుడు మీనరాశిలోకి సంచరించే సమయంలో దాని ప్రభావం అన్ని రాశులలో కనిపిస్తుంది. కొంతమందికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. 2025లో ఏయే రాశుల వారికి శని సంచారం మొదలవుతుందో చూద్దాం.
(3 / 5)
2025లో శని సంచారం మేషరాశికి ఏడున్నర శని మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఏడున్నర శని మొదటి దశ కాబట్టి, మీరు ఆకస్మికంగా ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి పురోగతిని చూడవచ్చు. ఆకస్మికంగా బాధ్యతలు పెరుగుతాయి. ఏడున్నర శని ప్రారంభంతో శని ప్రభావం అంతగా ఉండదు. అయితే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి ఈ సమయంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి.
(4 / 5)
2025లో శని సంచారం మీన రాశికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం అవుతుంది. అంటే శని దేవుడు ఈ దశలో ఈ రాశుల వారి వృత్తి, ఆర్థిక, సంబంధాలలో పెనుమార్పులు తీసుకురాబోతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ రాశులవారి సహనానికి పరీక్ష ఉంటుంది. చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన సమయం అవుతుంది. ఈ కాలంలో ఆధ్యాత్మికతపై ఎక్కువ సమయం వెచ్చించడం వల్ల ప్రభావం తగ్గుతుంది.
(5 / 5)
2025లో శని సంచారం కుంభరాశి వారికి ఏడున్నర శని చివరి దశ ప్రారంభం అవుతుంది. జీవితంలో ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్న మీరు 2025లో మంచి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రధానంగా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. ఆర్థిక స్థితిలో మంచి పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఆరోగ్యం, సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు