తెలుగు న్యూస్ / ఫోటో /
ఫ్యూచర్ కథాకమామిషు.. రిలయన్స్ ఆధీనంలోకి ఫ్యూచర్ స్టోర్లు!
ఫ్యూచర్ రిటైల్ అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతుంది. దీంతో దాదాపు 200 స్టోర్ల నిర్వహణ బాధ్యతను రిలయన్స్ రిటైల్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ తెలిపింది.
ఫ్యూచర్ రిటైల్ అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతుంది. దీంతో దాదాపు 200 స్టోర్ల నిర్వహణ బాధ్యతను రిలయన్స్ రిటైల్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ సంస్థ తెలిపింది.
(1 / 5)
బ్యాంకుల్లో కురుకుపోయిన అప్పులకు తోడుగా.. కరోనా కారణంగా వ్యాపారం నష్టాల్లో చిక్కుకుపోవడంతో ఫ్యూచర్ రిటైల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడేందుకు రిలయన్స్ రిటైల్‌తో చేతులు కలిపేందుకు సిద్దమవుతుంది. 2020లోనే రూ.24,713 కోట్ల డీల్‌తో ఫ్యూచర్ రిటైల్… .రిలయన్స్‌లో విలీనానికి ఒప్పందం కూడా కుదుర్చుకుంది.(REUTERS)
(2 / 5)
ఫ్యూచర్ గ్రూప్ దేశవ్యాప్తంగా 1,600 కంటే ఎక్కువ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. ప్రముఖ రిటైల్ స్టోర్ 'బిగ్ బజార్' ఈ కంపెనీకి చెందినదే. ఫైల్ ఫోటో: రాయిటర్స్(REUTERS)
(3 / 5)
తమకు ఫ్యూచర్ రిటైల్ అద్దెలు చెల్లించడం లేదంటూ కొందరూ యజమానులు రిలయన్స్‌ను ఆశ్రయించారు. దీంతో రిలయన్స్ ఆయా యజమానులతో లీజ్ ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఇక మిగిలిన స్టోర్ల పరిస్థితి కూడా ఇలానే ఉండడంతో వాటిని కూడా రిలయన్స్ స్వాధినం చేసుకునే అవకాశం ఉంది(REUTERS)
(4 / 5)
2020లో రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. 3.4 బిలియన్ డాలర్లతో రిలయన్స్ డీల్ కుదుర్చుకునే సమయంలో.. ప్యూఛర్ గ్రూప్ సహా భాగస్వామి అమెజాన్.. తమతో ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పేర్కొంటూ కోర్టులను ఆశ్రయించింది. సుప్రీంకోర్టుతో పాటు పలు న్యాయస్థానాల్లో ఈ కేసు విచారణ కొనసాగుతుంది.(REUTERS)
ఇతర గ్యాలరీలు