తెలుగు న్యూస్ / ఫోటో /
Ranji Trophy: ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‍లైన్‍కు ముందు రంజీలో ధనాధన్ సెంచరీ చేసిన ఆర్‌సీబీ ప్లేయర్
- రంజీ ట్రోఫీలో రజత్ పాటిదార్ దూకుడైన సెంచరీ చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున దుమ్మురేపే శతకం బాదాడు. ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‍లైన్ ముగిసే రెండు రోజుల ముందే ఈ దుమ్మురేపే బ్యాటింగ్ చేశాడు.
- రంజీ ట్రోఫీలో రజత్ పాటిదార్ దూకుడైన సెంచరీ చేశాడు. మధ్యప్రదేశ్ తరఫున దుమ్మురేపే శతకం బాదాడు. ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‍లైన్ ముగిసే రెండు రోజుల ముందే ఈ దుమ్మురేపే బ్యాటింగ్ చేశాడు.
(1 / 5)
దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్ అదిరిపోయే శతకం చేశాడు. హర్యానాతో మ్యాచ్‍లో నేడు 102 బంతుల్లోనే 159 పరుగులు బాదాడు పాటిదార్. 13 ఫోర్లు, 7 సిక్స్‌లతో దుమ్మురేపాడు.
(2 / 5)
ఐపీఎల్ రిటెన్షన్ డెడ్‍లైన్ మరో రెండు రోజుల్లో అక్టోబర్ 31న ముగియనుంది. ఏ ప్లేయర్లను రిటైన్ చేసుకుంటున్నారో, మెగా వేలంలోకి ఎవరిని వదులుతున్నారో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆలోగా ప్రకటించాలి. అయితే, ఐపీఎల్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున ఆడుతున్న రజత్ పాటిదార్ ఈ డెడ్‍లైన్‍కు ముందు బ్లాస్టింగ్ సెంచరీ చేశాడు.
(3 / 5)
దీంతో తన సత్తాను ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి చాటాడు భారత యంగ్ ప్లేయర్ పాటిదార్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్‍ను బెంగళూరు రిటైన్ చేసుకోవడం కచ్చితంగా కనిపిస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా.. మరి పాటిదార్‌ను ఆర్‌సీబీ ఉంచుకుంటోందో.. లేదో చూడాలి.
(4 / 5)
ఈ రంజీ మ్యాచ్‍లో చివరి రోజైన నేడు (అక్టోబర్ 29) 68 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరాడు పాటిదార్. దీంతో రంజీల్లో ఐదో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు.
(5 / 5)
మధ్యప్రదేశ్, హర్యానా మధ్య జరిగిన ఈ రంజీ ట్రోఫీ గ్రూప్ సీ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 308 పరుగులు చేయగా.. హర్యానా 440 సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ 4 వికెట్లకు 308 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా.. హర్యానా 3 వికెట్లకు 115 పరుగులు చేసిన సమయంలో చివరి రోజు రోజు ముగిసింది. దీంతో ఈ మ్యాచ్ డ్రా అయింది.
ఇతర గ్యాలరీలు