Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ఈజ్ బ్యాక్.. మళ్లీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ బాధ్యతలు
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ మళ్లీ వచ్చాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా మరోసారి బాధ్యతలు చేపట్టాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవీ కాలం ముగిసిన తర్వాత అతడు మళ్లీ ఐపీఎల్లో అడుగుపెట్టనున్నాడు.
(1 / 6)
Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ ఫ్రాంచైజీ శుక్రవారం అధికారికంగా ధృవీకరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే ఎడిషన్ కోసం రాజస్థాన్ రాయల్స్ కొత్త హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను నియమించింది.(PTI)
(2 / 6)
Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ సీఈఓ జాక్ లుష్ మెక్ క్రమ్ శుక్రవారం (సెప్టెంబర్ 6) బెంగళూరులో రాహుల్ ద్రవిడ్ కు పింక్ జెర్సీని అందజేశారు. గతంలో ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్ జెర్సీలో చాలా కాలం ఆడాడు. ఐపీఎల్లో రాజస్థాన్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.
(3 / 6)
Rahul Dravid: ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ద్రవిడ్ 2014, 2015 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి టీమ్ డైరెక్టర్, మెంటార్ గా పనిచేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ ను వీడి ఢిల్లీ ఫ్రాంచైజీలో సహాయక సిబ్బందిగా చేరాడు.
(4 / 6)
Rahul Dravid: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ గా తొలిసారి అతడు బాధ్యతలు చేపట్టబోతున్నాడు. టీమిండియాకు ఇదే పదవిలో ఉన్న అతనికి ఆ అనుభవం పనికొస్తుంది.
(5 / 6)
Rahul Dravid: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆటగాళ్ల రిటెన్షన్ మొత్తాన్ని లెక్కించడంలో అన్ని ఫ్రాంచైజీలు బిజీగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లేయర్స్ రిటెన్షన్ విషయంలో ద్రవిడ్ సాయం కోసం ముందుగానే అతనితో ఒప్పందాన్ని పూర్తి చేసుకుంది.
ఇతర గ్యాలరీలు