తెలుగు న్యూస్ / ఫోటో /
Lokesh Prajadarbar: వరుసగా నాలుగో రోజు లోకేష్ ప్రజాదర్బార్‌కు తరలివచ్చిన ప్రజలు
- Lokesh Prajadarbar: మంగళగిరి ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కష్టాల్లో ఉన్న ప్రజలకు స్వాంతన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లిలో యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.

(1 / 6)
తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయాశాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నారా లోకేష్ ఏర్పాటుచేశారు.
(2 / 6)
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ కూడా ఉంటున్నారు. సాధారణంగా సిఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది. గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డును బ్లాక్ చేశారు. చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తున్నారు.
(3 / 6)
సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి వచ్చిన వారితో ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి లోకేష్ ప్రతిఒక్కరినీ కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు.
(6 / 6)
సమస్యల పరిష్కారం కోసం లోకేష్‌కు వినతి పత్రం ఇస్తున్న ఉద్యోగులు, మీ-సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసిషయేన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇతర గ్యాలరీలు