తెలుగు న్యూస్ / ఫోటో /
Covid XE Variant | ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ లక్షణాలివే.. మీకు తెలుసా?
- భారత్‌లో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ ప్రవేశించింది. కరోనాకు చెందిన అన్ని వేరియంట్లలో.. ఎక్స్ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరి దీని లక్షణాలు, దీనిపై వ్యాక్సిన్ ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- భారత్‌లో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ ప్రవేశించింది. కరోనాకు చెందిన అన్ని వేరియంట్లలో.. ఎక్స్ఈ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మరి దీని లక్షణాలు, దీనిపై వ్యాక్సిన్ ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 9)
తాజాగా భారతదేశంలోని మహారాష్ట్రలో ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ కేసును గుర్తించారు. దక్షిణాఫ్రికాకు చెందిన 50 ఏళ్ల మహిళగా గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీన ఆమె భారత్‌కు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. (AFP)
(2 / 9)
ఫిబ్రవరి 27వ తేదీన ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఆమె ల్యాబ్ శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కస్తూర్బా హాస్పిటల్ సెంట్రల్ లాబొరేటరీకి రెఫర్ చేశారు.(Representative Image)
(3 / 9)
" కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్ఈ అనేది ఓమిక్రాన్‌కు చెందిన బీఏ.1, బీఏ.2 జాతుల కలయిక" అని ఆరోగ్య శాఖ తెలిపింది.(Representative Image)
(4 / 9)
"వైరస్‌ల సహజ జీవన గమనంలో భాగంగా.. జెనోమిక్ స్ట్రక్చర్‌లో తరచు మార్పులు జరగుతాయి. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలి" అని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. (AFP)
(5 / 9)
ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్‌ను జనవరి 19వ తేదీన మొదటిసారి యూకేలో కనుగొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది.(AFP)
(6 / 9)
మునపటి కరోనా వైరస్ జాతులకంటే.. ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్.. ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. (AFP)
(7 / 9)
జ్వరం, గొంతునొప్పి, దగ్గు, జలుబు, చర్మం చికాకు, రంగు మారడం, జీర్ణకోశ బాధ మొదలైనవి ఈ వేరియంట్ లక్షణాలుగా తెలిపారు. (AFP)
(8 / 9)
వేరియంట్ తీవ్రత, దానిపై టీకా ప్రభావం గురించి త్వరలోనే వెల్లడిస్తామని ఆరోగ్య శాఖ తెలిపింది. (AFP)
ఇతర గ్యాలరీలు