తెలుగు న్యూస్ / ఫోటో /
Bullet 350 launch: బుల్లెట్ 350.. మళ్లీ సరికొత్తగా
Bullet 350 launch: గత కాలపు అభిమానుల మనసుల్లో నిలిచిపోయిన బుల్లెట్ బైక్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ మరోసారి సరికొత్త అప్ డేట్స్ తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. క్లాసిక్ 350, హంటర్ 350, మీటియో 350 ల్లో వాడిన ఇంజన్ నే ఇందులో కూడా వినియోగించారు.
(1 / 8)
బుల్లెట్ బైక్ ను రాయల్ ఎన్ ఫీల్డ్ మరోసారి సరికొత్త అప్ డేట్స్ తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ బుల్లెట్ 350 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ బైక్ కు ఓల్డ్ డిజైన్ నే కొనసాగించడం విశేషం.
(2 / 8)
క్లాసిక్ 350, హంటర్ 350, మీటియో 350 ల తయారీ కి ఉపయోగించిన జే ప్లాట్ ఫామ్ నే బుల్లెట్ 350 తయారీలో కూడా ఉపయోగించారు. ఇంజన్ కూడా సేమ్ 349 సీసీ ఎయిర్ - ఆయిల్ కూల్డ్ ఇంజన్.
(3 / 8)
క్లాసిక్ 350, హంటర్ 350, మీటియో 350 లతో పాటు బుల్లెట్ 350 లో కూడా ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ నే ఉపయోగించారు.
(4 / 8)
క్లాసిక్ 350 మోడల్ తరహాలోనే హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లో అనలాగ్ స్పీడోమీటర్ తో పాటు చిన్నపాటి డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది.
(5 / 8)
ఓల్డ్ అండ్ ఒరిజినల్ బుల్లెట్ ను గుర్తుకు తెచ్చేలా డిజైన్ ను కొనసాగించారు. ఫ్యుయెల్ ట్యాంక్, రౌండ్ హెడ్ ల్యాంప్ , పైలట్ ల్యాంప్స్, టూల్ బాక్స్ .. వంటి వాటిని యథావిధిగా కొనసాగించారు.
(6 / 8)
సీట్ కూడా గతంలో మాదిరిగానే సింగిల్ పీస్ సీట్ ను కొనసాగించారు. ఇది క్లాసిక్ 350 కన్నా మరింత సౌకర్యంగా ఉంటుంది.
(7 / 8)
రాయల్ ఎన్ ఫీల్డ్ బ్యాడ్జ్ ను మెటల్ తో, మరింత ఆకర్షణీయంగా, కొట్టొచ్చేలా కనబడేలా ఫిక్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు