తెలుగు న్యూస్ / ఫోటో /
Neeraj Chopra: ఒక్క సెంటీమీటర్ తేడాతో టైటిల్ మిస్.. రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
- Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్ 2024లో రెండో ప్లేస్‍లో నిలిచారు. సెంటీమీటర్ తేడాతో టైటిల్ చేజారింది.
- Neeraj Chopra: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్ 2024లో రెండో ప్లేస్‍లో నిలిచారు. సెంటీమీటర్ తేడాతో టైటిల్ చేజారింది.
(1 / 5)
డైమండ్ లీగ్ 2024 టోర్నీలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కాస్తలో టైటిల్ మిస్ అయింది. కేవలం ఒక్క సెంటీమీటర్ (0.01 మీటర్) తేడాతో అతడు రెండో స్థానానికి పరిమితం అయ్యారు. (AFP)
(2 / 5)
బ్రసెల్స్ వేదికగా జరిగిన ఈ లీగ్ ఫైనల్‍లో ఈటె (జావెలిన్)ను నీరజ్ చోప్రా 87.86 మీటర్లు విసిరారు. అయితే, గ్రనాడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ తన తొలి ప్రయత్నంలోనే 87.87 మీటర్లు విసిరారు. మూడో ప్రయత్నంలో 87.86 మీటర్ల మార్కును నీరజ్ చేసినా.. ఒక్క సెంటీమీటర్ వెనుక నిలిచారు. ఆ తర్వాత కూడా ఆ మార్కును దాటలేదు. (AFP)
(3 / 5)
దీంతో 0.01 మీటర్ తేడాతో నీరజ్ చోప్రా రెండో ప్లేస్‍లో నిలిచారు. ఆండర్సన్‍కు డైమండ్ లీగ్ టైటిల్ దక్కింది. అతడు నేరుగా వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్‍షిప్‍కు అర్హత సాధించారు. (REUTERS)
(4 / 5)
డైమంగ్ లీగ్‍లో రన్నరప్‍గా నీరజ్ నిలిచారు. అతడికి 12,000 డాలర్లు (సుమారు రూ.10లక్షలు) ప్రైజ్‍మనీ దక్కింది. టైటిల్ గెలిచిన ఆండర్సన్‍కు 30వేల డాలర్లు దక్కాయి. 2022లో డైమండ్ లీగ్ గెలిచిన నీరజ్.. గతేడాది రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు మరోసారి సెకండ్ ప్లేస్ దక్కించుకున్నారు. (REUTERS)
ఇతర గ్యాలరీలు