తెలుగు న్యూస్ / ఫోటో /
National Cabbage Day 2024: ఈ రోజు నేషనల్ క్యాబేజీ డే, మనదేశంలో ప్రసిద్ధి పొందిన క్యాబేజీ వంటకాలు ఇవే
- National Cabbage Day 2024: ఇది క్యాబేజీలకు ప్రత్యేకమైన రోజు. దాని గొప్పతనం తెలిసేందుకు ప్రతి ఏడాది ఒకసారి జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. క్యాబేజీ ఎందుకు తినాలి అని చెప్పేందుకే ఈ ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు.
- National Cabbage Day 2024: ఇది క్యాబేజీలకు ప్రత్యేకమైన రోజు. దాని గొప్పతనం తెలిసేందుకు ప్రతి ఏడాది ఒకసారి జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. క్యాబేజీ ఎందుకు తినాలి అని చెప్పేందుకే ఈ ప్రత్యేకమైన దినోత్సవాన్ని ఏర్పాటుచేశారు.
(1 / 7)
ప్రతి ఏడాది ఫిబ్రవరి 17న జాతీయ క్యాబేజీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆహారంలో ప్రధాన భాగమైంది క్యాబేజీ. ఈ ఆరోగ్యకరమైన కూరగాయ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు భారతదేశంలో ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. ఇక్కడ కొన్ని సాంప్రదాయ భారతీయ క్యాబేజీ వంటకాలు ఉన్నాయి, వీటిని మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇష్టంగా తింటారు. (Pinterest)
(2 / 7)
క్యాబేజీ దాల్నా, పశ్చిమ బెంగాల్: క్యాబేజీ, బంగాళాదుంపలు మసాలాలతో కలిపి చేసే బెంగాలీ క్యాబేజీ కూర ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. (Pinterest)
(3 / 7)
ముత్తైకోస్ కుటు, తమిళనాడు: క్యాబేజీ, పప్పు, కొబ్బరితో కలిపి టేస్టీ వంటకం. దీన్ని తమిళనాడులో అధికంగా చేస్తారు. దీన్ని అక్కడ సాంప్రదాయ వంటకంగా భావిస్తారు. (Pinterest)
(4 / 7)
కోబి చే వాడి, గుజరాత్: క్యాబేజీ, పప్పు కలిపి చేసే బెస్ట్ కూర ఇది. గుజరాత్ లో అధికంగా దీన్ని తింటారు. (Pinterest)
(5 / 7)
కోబి ను షాక్, గుజరాత్: క్యాబేజీ, బఠానీలు, టొమాటోలతో చేసిన ఈ గుజరాతీ క్యాబేజీ కూర రోటీ లేదా అన్నంతో కలిపి తింటారు. (Pinterest)
(6 / 7)
క్యాబేజీ తరుగులో పచ్చి బఠానీలు వేసి ప్రతి చోటా కర్రీని వండుతారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. నీళ్లు వేయకుండా చిన్న మంట మీద కూర దగ్గరగా వండుతారు. ఇది అన్నంలోకి, చపాతీలోకి కూడా టేస్టీగా ఉంటుంది.(youtube)
ఇతర గ్యాలరీలు