తెలుగు న్యూస్ / ఫోటో /
IPL 2025 MI Retention: ఐపీఎల్ 2025 కోసం ముంబయి ఇండియన్స్ రిటెన్ చేసుకునే ప్లేయర్లు వీళ్లే!
ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ కెప్టెన్ హార్దిక్ పాండ్య, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య ఇగో సమస్యలను తగ్గించాలని ఐపీఎల్ 2024లో చాలా ప్రయత్నించింది. కానీ ఫెయిలైంది. దాంతో ఐపీఎల్ 2025 వేలం ముంగిట ఆ ఫ్రాంఛైజీ ముందు రెండే దారులు ఉన్నాయి.
(1 / 5)
ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట.. ఆటగాళ్లని అట్టిపెట్టుకునే జాబితాని ఫ్రాంఛైజీలు అక్టోబరు 31లోపు సమర్పించాల్సి ఉంది. అన్ని ఫ్రాంఛైజీలు ఇప్పటికే జాబితాని సిద్ధం చేసుకోగా.. అందరి దృష్టి ముంబయి ఇండియన్స్‌పై ఉంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను రిటెన్ చేసుకుంటాదా? లేదా వేలానికి వదిలేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్‌ని ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్‌గా ముంబయి ఇండియన్స్ ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో రూ.11 కోట్లతో సూర్య రిటెన్ చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.(AFP)
(2 / 5)
ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఒకవేళ హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలను రిటేన్ చేసుకుంటే ఇద్దరికే రూ. 36 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే అప్పుడు సూర్యకుమార్ యాదవ్‌కి రూ.14 లేదా రూ.11 కోట్లని మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది. ఒకవేళ సూర్యని వేలంలోకి వదిలేసి రైట్ టు మ్యాచ్ ద్వారా దక్కించుకోవాలని ఆశిస్తే.. అతనికి ఉన్న టీ20 రికార్డులతో భారీ ధర పలికే అవకాశం ఉంది. కాబట్టి జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లో ఒకరికి మాత్రమే రూ.14 కోట్లు ఇచ్చే అవకాశం ఉండగా.. ఎవరికి ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి.(AFP)
(3 / 5)
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా రూపంలో నలుగురు క్రికెటర్లని రిటేన్ చేసుకున్నా.. చాలా మంది కీ ప్లేయర్లని వేలానికి ముంబయి వదిలేయాల్సి వస్తుంది. ఉదాహరణకి తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ గత కొన్ని సీజన్లుగా ముంబయి తరఫున నిలకడగా ఆడుతున్నాడు. అతడిని నిలబెట్టుకోవడం కుదరడం లేదు. ఫ్రాంఛైజీకి రూ. 120 రూపాయల పర్స్ విలువ ఉన్నా.. ఐదుగురు క్రికెటర్లను రిటైన్ చేసుకోవడానికి ముంబై దాదాపు 65 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. (AFP)
(4 / 5)
ముంబయి జట్టులో జస్‌ప్రీత్ బుమ్రా చాలా కీలకమైన ప్లేయర్. సూర్య, హార్దిక్, రోహిత్ విషయంలో ఎలా ఉన్నా జస్‌ప్రీత్ బుమ్రాని సంతృప్తి పరచడం ముంబయి ఫ్రాంఛైజీకి చాలా కీలకం. డెత్ ఓవర్లలో పదునైన బౌలింగ్‌తో ఒంటిచేత్తో మ్యాచ్‌లను బుమ్రా గెలిపించగలడు. దాంతో బుమ్రాని ఫస్ట్ లేదా సెకండ్ ఛాయిస్ ప్లేయర్‌గా ఎంచుకోవడంపై కూడా ముంబయి ఫ్రాంఛైజీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.(PTI)
(5 / 5)
ఒకవేళ ముంబయి ఇండియన్స్ రోహిత్ శర్మని రిటెన్ చేసుకోవాలనుకుంటే.. ధర నుంచి హార్దిక్ పాండ్యాతో సమానంగా చూడాల్సి వస్తుంది. అంటే.. హార్దిక్ పాండ్యాని రూ.18 కోట్లతో రిటెన్ చేసుకుంటే.. రోహిత్ శర్మకి కూడా అంతే చెల్లించాల్సి వస్తుంది. అప్పుడగానీ.. ఇద్దరి మధ్య ఇగో సమస్యలు రావు. ఐపీఎల్ 2024లో ఇద్దరూ కాస్త దూరం దూరంగా ఉన్నా.. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత రోహిత్‌కు హార్దిక్‌పై కొంత అభిమానం పెరిగినట్లు కనిపిస్తోంది. కానీ.. టోర్నీ టైమ్‌లో సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. (PTI)
ఇతర గ్యాలరీలు