నవంబర్ 24, నేటి రాశి ఫలాలు - కళాకారులకు కలిసొచ్చే కాలం, రాసి పెట్టి ఉన్న వాహన యోగం
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 24.11.2024 ఆదివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
రాశిఫలాలు (నేటి రాశిఫలాలు) 24-11-2024
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
మాసం: కార్తీకము, వారం: ఆదివారం, తిథి: బ.నవమి, నక్షత్రం: పుబ్బ
మేషం:
కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలసి వస్తాయి. సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నింటా విజయం లభిస్తుంది. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.
వృషభం:
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సమస్యల నుంచి గట్టెక్కుతారు. శుభకార్య యత్నాలు చేపడతారు. వాహనం కొనే ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ చర్యలు చేపడతారు. శ్రమానంతరం ఫలితం లభిస్తుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వివాదాల్లో తల దూర్చవద్దు.
మిథునం:
రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. సమస్యలు తీరతాయి. వాహనయోగం ఉంటుంది. అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యయత్నాలు చేపడతారు. ఖర్చు పెరుగుతుంది. కళా రంగంలోని వారికి, రాజకీయ నాయకులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కర్కాటకం:
ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలోచన చేస్తారు. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మంచి సమాచారం అందుకుంటారు. పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. సమయానికి సొమ్ము చేతికి అంది అవసరాలు తీరతాయి.
సింహం:
అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. ఊహించని విధంగా అన్నీ కలసివస్తాయి. రాజకీయాలు, కళా రంగంలోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన చేస్తారు. ఇంటి నిర్మాణ చర్యలు చేపడతారు. ఆటంకాలు తొలగుతాయి. ఉత్సాహవంతంగా ఉంటుంది.
కన్య:
ఆలోచనలు కలసివస్తాయి. చికాకులు తొలగుతాయి. నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. వివాదాలు తలెత్తవచ్చు. ఓర్పు వహించాలి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. అనారోగ్య సూచన.
తుల:
సమస్యలు పరిష్కారమవుతాయి. అంతటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. వాహన, గృహ కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. రాజకీయనాయకులు, కళాకారులు, క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం
వివాదాల నుంచి గట్టెక్కుతారు. అనుకోని విధంగా సొమ్ము చేతికి అందుతుంది. భూములు, వాహనాలు కొనే ప్రయత్నాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణ చేపడతారు. శుభకార్యయత్నాలు చేస్తారు. కళాకారులు, క్రీడాకారులకు బాగుంటుంది.
ధనుస్సు:
ఆదాయం పెరుగుతుంది. సమస్యలు తీరతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులు సాయం చేస్తారు. శుభకార్య యత్నాలు చేపడతారు. వ్యాపారులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులు, కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది.
మకరం:
పనుల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. పనిపై శ్రద్ధ చూపాలి. ఒత్తిళ్ళు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఓర్పు వహించండి. మాట తూలవద్దు.
కుంభం:
పనుల్లో జాప్యం జరుగుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు వద్దు. ఇంట్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనాలు కొనే ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అనుకోని విధంగా మద్దతు లభిస్తుంది.
మీనం:
ఖర్చు పెరుగుతుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొత్త వారితో పరిచయాలు అవుతాయి. ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. స్థిర, చరాస్తులు కొనే ప్రయత్నం చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.