తెలుగు న్యూస్ / ఫోటో /
Multani Mitti Benefits। ముల్తానీ మట్టితో మీ ముఖం మాణిక్యంలా మెరుస్తుంది, మరెన్నో ప్రయోజనాలు!
- ముల్తానీ మట్టి గురించి మీ అందరూ వినే ఉంటారు. ముఖానికి ముల్తానీ మట్టిని ఉపయోగించి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
- ముల్తానీ మట్టి గురించి మీ అందరూ వినే ఉంటారు. ముఖానికి ముల్తానీ మట్టిని ఉపయోగించి అద్భుత ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
(1 / 7)
'ఫుల్లర్స్ ఎర్త్' అని పిలిచే ఒక మట్టి రకం భారతదేశంలో ముల్తానీ మట్టిగా ప్రసిద్ధి చెందింది. దీనిని అనేక చర్మ, జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే వృద్ధాప్య ఛాయలను నివారించటంలో, పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.(Unsplash)
(2 / 7)
Pigmentation: ముల్తానీ మట్టి చర్మంపై చల్లటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది కళ్లకింద నల్లటి వలయాలు, చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలు తొలగించడంలో సహాయపడుతుంది.(Unsplash)
(3 / 7)
Acne: ముల్తానీ మట్టి చర్మంపై చెమట, మలినాలను శుభ్రంచేస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా మొటిమలకు చికిత్స చేస్తుంది. దురద, వాపు వల్ల కలిగే చికాకును కూడా తగ్గిస్తుంది. అంతేకాదు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది. జిడ్డు చర్మంపై అధిక నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది.(Unsplash)
(4 / 7)
Acts as an antiseptic: ముల్తానీ మట్టి ఒక ప్రభావవంతమైన యాంటీమైక్రోబయల్ కూడా. ఇది చర్మంపై గాయాలు వృద్ధి చెందకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.(Unsplash)
(5 / 7)
Spot treatment:ముఖంపై జిడ్డు ఎక్కువగా ఉంటే ముల్తానీ మట్టి పూసి కడిగేసుకోవాలి. ముల్తానీ మట్టిలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌గా చేసి మొటిమలపై రాస్తే అవి ఎండిపోయి ఎరుపుదనం తగ్గుతాయి.(Unsplash)
(6 / 7)
Skin brightening: చర్మంపై మృతకణాలను తొలగించి చర్మంలో జీవం నింపుతుంది. స్కిన్ టోన్ ఈవెన్‌నెస్‌లో సహాయపడుతుంది. మెరిసే రూపాన్ని అందిస్తుంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు