తెలుగు న్యూస్ / ఫోటో /
sankranti recipes: మకర సంక్రాంతికి ఈ వంటకాలు సిద్ధం చేస్తే పండుగ అదిరిపోతుంది
- Sankranti 2024 Recipes: మకర సంక్రాంతిని భారతదేశంలో ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. పంటల పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు అనేక రకాల స్వీట్లను తయారు చేస్తారు.
- Sankranti 2024 Recipes: మకర సంక్రాంతిని భారతదేశంలో ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. పంటల పండుగ అని పిలుస్తారు. సంక్రాంతి రోజు అనేక రకాల స్వీట్లను తయారు చేస్తారు.
(1 / 7)
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగకు ప్రత్యేక వంటకాలు తయారు చేయడం ఆనవాయితీ. ఎలాంటి వంటకాలు సంక్రాంతికి వండుతారో తెలుసుకుందాం.
(2 / 7)
పొంగల్: మకర సంక్రాంతికి పొంగల్ చాలా ప్రత్యేకం. దక్షిణాది రాష్ట్రాల్లో పొంగల్‌ను తయారుచేస్తారు. బియ్యం, శెనగపిండి, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, అల్లంతో పొంగల్ ను తయారుచేస్తారు. అన్నం, బెల్లం కలిపి కూడా స్వీట్ పొంగల్‌ను తయారు చేసుకోవచ్చు.
(3 / 7)
బొబ్బట్లు: దీనిని కర్ణాటకలో హోలిగే అని పిలుస్తారు. మైదా పిండి లేదా గోధుమ పిండి, శెనగపప్పు, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి కలిపి దీన్ని తయారు చేస్తారు.
(4 / 7)
నువ్వులుండలు: మకర సంక్రాంతికి చేసే సంప్రదాయ వంటలలో ఇది ఒకటి. వేయించిన నువ్వులు, బెల్లం వేసి వీటిని తయారుచేస్తారు.
(5 / 7)
పాయసం: పాయసం లేకుండా సంక్రాంతి పండుగ ఉండదు. మకర సంక్రాంతికి అన్నం, బెల్లం, నట్స్, నెయ్యి వేసి దీన్ని వండుతారు.
(6 / 7)
బెల్లం హల్వా: ఇది ఉత్తర భారతదేశంలో సంక్రాంతికి తయారుచేసే ప్రత్యేక వంటకం. దీన్ని గోధుమ పిండి, బెల్లం, నెయ్యితో తయారుచేసే స్వీట్.
ఇతర గ్యాలరీలు