TTD Brahmotsavalu: వైభవంగా మలయప్ప స్వామి రథోత్సవం, భక్తజనసంద్రంగా మారిన తిరుమల మాడవీధులు-magnificent malayappa swamy rathotsavam in tirumala madavedhulu ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ttd Brahmotsavalu: వైభవంగా మలయప్ప స్వామి రథోత్సవం, భక్తజనసంద్రంగా మారిన తిరుమల మాడవీధులు

TTD Brahmotsavalu: వైభవంగా మలయప్ప స్వామి రథోత్సవం, భక్తజనసంద్రంగా మారిన తిరుమల మాడవీధులు

Published Oct 11, 2024 11:35 AM IST Bolleddu Sarath Chandra
Published Oct 11, 2024 11:35 AM IST

  • TTD Brahmotsavalu: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో  ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. 

తిరుమల మాడవీధుల్లో రథంపై విహరిస్తున్న స్వామి తన్మయత్వంతో చూస్తున్న యువతి

(1 / 11)

తిరుమల మాడవీధుల్లో రథంపై విహరిస్తున్న స్వామి తన్మయత్వంతో చూస్తున్న యువతి

రథోత్సవంలో మలయప్ప స్వామికి భక్తితో మొక్కుతున్న చిన్నారులు

(2 / 11)

రథోత్సవంలో మలయప్ప స్వామికి భక్తితో మొక్కుతున్న చిన్నారులు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో శుక్రవారం  ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 

(3 / 11)

రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. 

(4 / 11)

రథోత్సవం సందర్భంగా శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.  గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి.

(5 / 11)

భక్త జన సంద్రంగా మారిన తిరుమల మాడవీధుల్లో అంగరంగ వైభవంగా శ్రీవారి రథోత్సవాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నిర్వహించారు. 

(6 / 11)

శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది. 

(7 / 11)

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

(8 / 11)

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. 

(9 / 11)

రథోత్సవంలో ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు కనువిందు చేసిన మలయప్ప స్వామి

(10 / 11)

రథోత్సవంలో ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు కనువిందు చేసిన మలయప్ప స్వామి

రథోత్సవంలో  భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా  ఏనుగు అంబారీలు రథం ముందు కదిలాయి. 

(11 / 11)

ఇతర గ్యాలరీలు