నక్షత్రం మారనున్న బుధుడు: ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రానుంది!
- పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు త్వరలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల వారం రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
- పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు త్వరలో ప్రవేశించనున్నాడు. దీనివల్ల వారం రోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
(1 / 5)
గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడి సంచారం.. రాశులపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం మఖ నక్షత్రంలో సంచరిస్తున్న బుధుడు.. త్వరలో పూర్వ ఫల్గుణిలోకి అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల కొన్ని రాశులకు కలిసి రానుంది.
(2 / 5)
సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం వరకు అదే రాశిలో ఉంటాడు. దీనివల్ల ఈ వారం రోజులు కొన్ని రాశుల వారికి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది.
(3 / 5)
తుల: పూర్వ ఫల్గుణిలో బుధుడి సంచారం వల్ల తులా రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. ఈ కాలంలో వీరికి ధనపరంగా లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. కష్టపడి చేసిన పనులకు తగిన ప్రతిఫలం ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం మెరుగుపడుతుంది.
(4 / 5)
కన్య: ఈ కాలంలో కన్యా రాశి వారికి కూడా కలిసి వస్తుంది. ఆర్థికరమైన కష్టాలు తొలగిపోవచ్చు. ప్రమోషన్ పెండింగ్‍లో ఉంటే దానికి మార్గం సుగమమం అవుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు పెరిగే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి దక్కుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. (Pixabay)
(5 / 5)
మిథునరాశి: పూర్వ ఫల్గుణి నక్షత్రంలో బుధుడి సంచారం.. మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరి కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మద్దతు దక్కుతుంది. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలు తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించాలి)
ఇతర గ్యాలరీలు