Wedding Decor Ideas | ఈ అలంకరణ ఐడియాలతో వివాహ వేడుక అవుతుంది మరింత శోభాయమానం!-latest trendy wedding decor ideas from across india ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Wedding Decor Ideas | ఈ అలంకరణ ఐడియాలతో వివాహ వేడుక అవుతుంది మరింత శోభాయమానం!

Wedding Decor Ideas | ఈ అలంకరణ ఐడియాలతో వివాహ వేడుక అవుతుంది మరింత శోభాయమానం!

Apr 20, 2022, 09:39 PM IST HT Telugu Desk
Apr 20, 2022, 09:39 PM , IST

ఒకప్పటి పెళ్లిళ్లకి, ఇప్పటి పెళ్లిళ్లకి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడంతా ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యవహారమే. మనం కేవలం ఐడియాలు ఇస్తే చాలు. వేదిక నుంచి వెడ్డింగ్ డెకరేషన్ వరకు ఏం కావాలన్నా, ఎలా కావాలన్నా మొత్తం వారే చూసుకుంటున్నారు. మరి మీలో ఎవరైనా వివాహం ప్లాన్ చేస్తుంటే మీకు ఈ ఐడియాలు ఉపయోగపడవచ్చు.

ఈరోజులో చేసే వివాహాలకు సంబంధించిన ప్రతి అంశం గతంతో పోలిస్తే పూర్తి నాటకీయంగా మారిపోయింది. నాడు ఇంటి వద్దే పందిరి వేసి, భోజనాలు వండి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్, ప్యాలెస్ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్. వివాహానికి వేసే పందిరి డెకొరేషన్ నుంచి అప్పగింతల వరకు కొత్త పోకడలు పుట్టుకొచ్చాయి.

(1 / 9)

ఈరోజులో చేసే వివాహాలకు సంబంధించిన ప్రతి అంశం గతంతో పోలిస్తే పూర్తి నాటకీయంగా మారిపోయింది. నాడు ఇంటి వద్దే పందిరి వేసి, భోజనాలు వండి పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్, ప్యాలెస్ లేదా డెస్టినేషన్ వెడ్డింగ్. వివాహానికి వేసే పందిరి డెకొరేషన్ నుంచి అప్పగింతల వరకు కొత్త పోకడలు పుట్టుకొచ్చాయి.(Photo by Amish Thakkar on Unsplash)

ఇప్పుడు కొంత మంది జంటలకైతే అసలు పెళ్లి చేసుకుందామన్నా తీరక, సమయం లేకుండా పోతున్నాయి. ఏదేమైనా పెళ్లి ఉన్నంతలో డెకొరేట్ చేసుకోవడానికి WeddingWire India కంపెనీ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ అనమ్ జుబైర్ కొన్ని ఐడియాలు ఇస్తున్నారు.

(2 / 9)

ఇప్పుడు కొంత మంది జంటలకైతే అసలు పెళ్లి చేసుకుందామన్నా తీరక, సమయం లేకుండా పోతున్నాయి. ఏదేమైనా పెళ్లి ఉన్నంతలో డెకొరేట్ చేసుకోవడానికి WeddingWire India కంపెనీ మార్కెటింగ్ అసోసియేట్ డైరెక్టర్ అనమ్ జుబైర్ కొన్ని ఐడియాలు ఇస్తున్నారు.(Photo by Guanfranco G on Unsplash)

అనమ్ జుబైర్ ప్రకారం, వివాహ అలంకరణకు సంబంధించి ప్లాన్ చేసుకునేటపుడు ముహూర్తం అనేది ముఖ్యం. అది ఉదయమా, సాయంత్రమా.. అంటే వెలుతురు ఉన్నప్పుడా, చీకట్లోనా అని తెలుసుకోవాలి. చీకట్లో అయితే లైటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఇండోర్ వివాహమా, ఔట్ డోర్ వివాహమా అనేది పరిగణించాలి. ఆ ప్రకారంగా ఒక థీమ్ ఎంచుకోవాలి.

(3 / 9)

అనమ్ జుబైర్ ప్రకారం, వివాహ అలంకరణకు సంబంధించి ప్లాన్ చేసుకునేటపుడు ముహూర్తం అనేది ముఖ్యం. అది ఉదయమా, సాయంత్రమా.. అంటే వెలుతురు ఉన్నప్పుడా, చీకట్లోనా అని తెలుసుకోవాలి. చీకట్లో అయితే లైటింగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే ఇండోర్ వివాహమా, ఔట్ డోర్ వివాహమా అనేది పరిగణించాలి. ఆ ప్రకారంగా ఒక థీమ్ ఎంచుకోవాలి.(Photo by Andre Hunter on Unsplash)

బోహేమియన్ డెకర్ - ఔట్ డోర్ వివాహం కోసం బోహేమియన్ డెకర్ తరహా అలంకరణ అత్యంత ప్రజాదరణ పొందిన వెడ్డింగ్ డెకరేషన్ థీమ్. ఈ డెకర్ స్టైల్ ఖచ్చితంగా మరపురాని అనుభూతిని ఇస్తుంది.

(4 / 9)

బోహేమియన్ డెకర్ - ఔట్ డోర్ వివాహం కోసం బోహేమియన్ డెకర్ తరహా అలంకరణ అత్యంత ప్రజాదరణ పొందిన వెడ్డింగ్ డెకరేషన్ థీమ్. ఈ డెకర్ స్టైల్ ఖచ్చితంగా మరపురాని అనుభూతిని ఇస్తుంది.(Twitter/festivalbrides)

డ్రీమీ డెకర్: ఎంట్రీ పాసేజ్‌ల నుంచి వేదిక వరకు అంతా మిరుమిట్లు గొలిపేలా ఉండే ఈ థీమ్ విస్తృత ప్రజాదరణ పొందుతుంది.

(5 / 9)

డ్రీమీ డెకర్: ఎంట్రీ పాసేజ్‌ల నుంచి వేదిక వరకు అంతా మిరుమిట్లు గొలిపేలా ఉండే ఈ థీమ్ విస్తృత ప్రజాదరణ పొందుతుంది.(Twitter/TheBrideStory)

ఫ్లోరల్ డెకర్ - ఎటు చూసినా పువ్వులు, అలంకరణలతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ తరహా వివాహ అలంకరణ ఒక తోటలో పెళ్లి చేసుకున్నట్లుగా అనుభూతిని కల్పిస్తుంది. అలంకరణ కోసం ట్యూబెరోస్, ఆర్కిడ్‌లు, గులాబీలు, లిల్లీస్, క్రిసాన్తిమమ్స్, హైడ్రేంజస్ వంటి పువ్వులను కూడా ఎంచుకోవచ్చు. అందంతో పాటు మంచి సువాసనలు వెదజల్లుతాయి. 

(6 / 9)

ఫ్లోరల్ డెకర్ - ఎటు చూసినా పువ్వులు, అలంకరణలతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఈ తరహా వివాహ అలంకరణ ఒక తోటలో పెళ్లి చేసుకున్నట్లుగా అనుభూతిని కల్పిస్తుంది. అలంకరణ కోసం ట్యూబెరోస్, ఆర్కిడ్‌లు, గులాబీలు, లిల్లీస్, క్రిసాన్తిమమ్స్, హైడ్రేంజస్ వంటి పువ్వులను కూడా ఎంచుకోవచ్చు. అందంతో పాటు మంచి సువాసనలు వెదజల్లుతాయి. (Twitter/eventsglobal_co)

వైబ్రెంట్ కలర్ ట్రెండ్స్ - ఎటూ చూసినా ప్రకాశవంతమైన రంగులతో, క్లాసిక్ టింట్స్‌తో అలంకరణ సిద్ధం చేయడం. ఇది నిజంగా ఒక పండగ వచ్చినట్లుగా సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని తీసుకొస్తుంది. క్రీమ్, బ్లష్‌, పీచ్‌, హాట్ పింక్‌, ఎరుపు, నారింజ రంగులు ఉపయోగించవచ్చు.

(7 / 9)

వైబ్రెంట్ కలర్ ట్రెండ్స్ - ఎటూ చూసినా ప్రకాశవంతమైన రంగులతో, క్లాసిక్ టింట్స్‌తో అలంకరణ సిద్ధం చేయడం. ఇది నిజంగా ఒక పండగ వచ్చినట్లుగా సరికొత్త ఉత్సవ వాతావరణాన్ని తీసుకొస్తుంది. క్రీమ్, బ్లష్‌, పీచ్‌, హాట్ పింక్‌, ఎరుపు, నారింజ రంగులు ఉపయోగించవచ్చు.(Twitter/Trends_Zone)

పర్సనలైజేషన్ వెడ్డింగ్ డెకర్‌- ఈ తరహా డెకరేషన్ మీ అభిరుచులను ప్రతిబింబిస్తుంది. ఈ మధ్య సెలబ్రెటీ వెడ్డింగ్ లలో ఎక్కువగా ఇలాంటి థీమ్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు విరాట్+ అనుష్క లేదా #విరుష్క, చైసామ్ ఇలా మనకు నచ్చినట్లుగా హ్యాష్ టాగ్స్, ఫోటోస్, క్‌టెయిల్ గ్లాసెస్, డెకర్, డ్యాన్స్ ఫ్లోర్ ఇలా ఎన్నో రకాల థీమ్స్ ఉన్నాయి.

(8 / 9)

పర్సనలైజేషన్ వెడ్డింగ్ డెకర్‌- ఈ తరహా డెకరేషన్ మీ అభిరుచులను ప్రతిబింబిస్తుంది. ఈ మధ్య సెలబ్రెటీ వెడ్డింగ్ లలో ఎక్కువగా ఇలాంటి థీమ్ ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు విరాట్+ అనుష్క లేదా #విరుష్క, చైసామ్ ఇలా మనకు నచ్చినట్లుగా హ్యాష్ టాగ్స్, ఫోటోస్, క్‌టెయిల్ గ్లాసెస్, డెకర్, డ్యాన్స్ ఫ్లోర్ ఇలా ఎన్నో రకాల థీమ్స్ ఉన్నాయి.(Twitter/SamaniDecorator)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు