Destination Wedding | డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇండియాలో ఇవి బెస్ట్ ప్లేసెస్!-best places for a destination wedding in india ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Destination Wedding | డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇండియాలో ఇవి బెస్ట్ ప్లేసెస్!

Destination Wedding | డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇండియాలో ఇవి బెస్ట్ ప్లేసెస్!

Published Jan 21, 2022 03:07 PM IST Rekulapally Saichand
Published Jan 21, 2022 03:07 PM IST

  • పెళ్లి అనగానే ఆకాశమంత పందిరి వేసి భూదేవి అంతపీట వేసి అట్టహాసంగా వివాహ వేడుకను జరుపుకోవాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ కరోనా కారణంగా పరిస్థితులు మారాయి. పరిమితమైన బంధువుల మధ్య హడావుడిగా తంతును ముగించేస్తున్నారు.

మాయదారి కరోనా విజృంభణతో కళ్యాణ వేడుక కళ తప్పింది. అంగరంగ వైభవంగా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారికి ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. కరోనా కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తుండటంతో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ కష్టంగా మారాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. మన దేశంలో కూడా మంచి మంచి డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ స్పాట్స్ ఉన్నాయి.

(1 / 6)

లవాసా, మహారాష్ట్ర: ఎత్తైన పచ్చని కొండలు... సుందరమైన ప్రకృతి సోయగాల నడుమ ఉండే ప్రాంతం లవాసా. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మంచి ఆప్షన్ అని చెప్పాలి. పెళ్లి వేడుకను ఇక్కడ ఘనంగా జరుపుకోవచ్చు.

(2 / 6)

అలెప్పి, కేరళ: ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే మధురమైన వేడుక పెళ్లి. ఆ వైభవానికి సంబంధించిన జ్ఞాపకాలు మధురంగా ఉండాలంటే వివాహ మహోత్సవం.. బంధుమిత్రుల సమక్షంలో వేదోచ్ఛరణల మధ్య ఘనంగా జరగాలి. అలాగే వేదిక వాతావరణం ఆహ్లదకరంగా కనిపించాలి. అందుకు కేరళలోని అలెప్పి స్పాట్ మంచి వేదిక అని చెప్పొచ్చు. ఆహ్లదకరంగా కనిపించే పరిసరాలు, కొబ్బరి తోటలు, పచ్చటి ప్రదేశాల మధ్య ఇక్కడ పెళ్లి వేడుకను జరుపుకుంటే అదొక జీవితకాలపు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

(3 / 6)

గోకర్ణ (Gokarna): దక్షిణ కర్ణాటకలోని గోకర్ణ ప్రాంతం బీచ్ అందాలను ఆస్వాదించాలకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. వివాహ వేడుకలకు కూడా ఇది అనువైన ప్రాంతం. పెళ్లితో పాటు హానీమూన్ స్పాట్‌గా కూడా ఈ ప్రాంతం మంచి అనుభూతుల్ని పంచుతుంది.

(4 / 6)

గోవా: పర్యాటకంగానే కాదు డిస్టినేష‌న్ వెడ్డింగ్‌లకు కూడా గోవా మంచి ఆప్షన్. కేవలం రూ. 3 - 4 లక్షల బడ్జెట్‌లో ఇక్కడ గ్రాండ్‌గా వెడ్డింగ్‌ సెలబ్రెషన్స్ జరుపుకోవచ్చు.

(5 / 6)

తెల్లటి మంచు తివాచీ పరుచుకున్నట్లుగా ఉండే సిమ్లా వివాహ వేడుకలకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. చల్లటి సిమ్లా అందాలను ఆస్వాదిస్తూ వివాహ వేడుకను జరుపుకుంటే ఆ ఆనందం మాటలకందనిది. రూ. 10 - 20 లక్షల బడ్జెట్‌తో ఇక్కడ వివాహ వేడుకను ప్లాన్ చేసుకోవచ్చు.

(6 / 6)

(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు