తెలుగు న్యూస్ / ఫోటో /
TS Rajiv Arogyasri Scheme : తెల్ల రేషన్ కార్డు లేకున్నా 'ఆరోగ్య శ్రీ' స్కీమ్..! త్వరలోనే కొత్త కార్డుల జారీ
- TS Rajiv Arogyasri Health Card Updates: ఆరోగ్య శ్రీ సేవలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రూ. 10 లక్షల వరకు వైద్యసాయం అందించేలా ఇప్పటికే ఆదేశాలను కూడా ఇచ్చింది. కొత్తగా రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వాలని భావిస్తున్న సర్కార్… కీలక నిర్ణయం ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
- TS Rajiv Arogyasri Health Card Updates: ఆరోగ్య శ్రీ సేవలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రూ. 10 లక్షల వరకు వైద్యసాయం అందించేలా ఇప్పటికే ఆదేశాలను కూడా ఇచ్చింది. కొత్తగా రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డులను ఇవ్వాలని భావిస్తున్న సర్కార్… కీలక నిర్ణయం ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైంది.
(1 / 5)
గతంలో ఆరోగ్య శ్రీ హెల్త్ బీమా రూ. 5 లక్షల వరకే ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది. దీనిపై రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే(https://rajivaarogyasri.telangana.gov.in/)
(2 / 5)
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలో కార్డులను కూడా పంపిణీ చేశారు. అప్పట్నుంచి… ఇవాళ్టి వరకు కొత్త కార్డులను మంజూరు చేయలేదు(https://rajivaarogyasri.telangana.gov.in/)
(3 / 5)
ఈ కార్డు పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి. కానీ చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవటంతో ఈ స్కీమ్ కు దూరమవుతున్నారు. అంతేకాకుండా…. వివాహాలు చేసుకోవటం, విడిపోవటం వంటి పలు కారణాల రీత్యా కూడా చాలా మంది ఈ స్కీమ్ లో భాగం కాలేకపోతున్నారు.(https://rajivaarogyasri.telangana.gov.in/)
(4 / 5)
ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటివలే జరిగిన మంత్రివర్గం సమావేశంలో కూడా ఈ స్కీమ్ అమలుపై చర్చించినట్లు తెలిసింది. ప్రధానంగా కొత్త కార్డులను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.(https://rajivaarogyasri.telangana.gov.in/)
(5 / 5)
రూ. 10 లక్షల వరకు పూర్తి బీమాతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని అందించాలని నిర్ణయించింది. అయితే తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే కొత్త కార్డులను ఇవ్వాలని యోచిస్తోంది. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితితో పాటు ఆదాయాన్ని లెక్కలోకి తీసుకొని అర్హులను నిర్ణయిస్తారని సమాచారం. అంతేకాకుండా…. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొన్ని కొత్త కార్డులను ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో కొత్త కార్డులను జారీ చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించింది.(https://rajivaarogyasri.telangana.gov.in/)
ఇతర గ్యాలరీలు