తెలుగు న్యూస్ / ఫోటో /
Foods for Healthy Joints। కీళ్లనొప్పులు ఉన్నపుడు ఇలాంటివి తింటే.. నొప్పులు మాయం
- Foods for Healthy Joints: మనం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే అందుకు మనం చేయాల్సింది. మంచి ఆహారం తీసుకోవడం, శరీరాన్ని కదిలించడం, దానికి కొంత శ్రమ కల్పించడం. కానీ మనకు కీళ్లనొప్పులు ఉంటే ఆ పని చేయలేం, తద్వారా అది మన మొత్తం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. దానికి పరిష్కారం ఇక్కడ చూడండి.

(1 / 6)
ఆర్థరైటిస్, ఫైబ్రోమైయాల్జియా, బర్సిటిస్ వంటి ఆరోగ్య పరిస్థితులు కీళ్ల నొప్పులను కలిగిస్తాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలు మంట, వేడి పుట్టించి కీళ్లనొప్పులను మరింత తీవ్రతరం చేస్తాయి. దీనిని నివారించాలంటే సరైన ఆహారాలు తీసుకోవాలి, అవి కీళ్లలో పట్టుత్వాన్ని బలోపేతం చేసేవి అయి ఉండాలి. ఆ ఆహారాలేమిటో ఇక్కడ చూడండి. (Shutterstock)
(2 / 6)
తాజాగా లభించే పచ్చి పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుందని పరిశోధనలు తెలిపాయి. కాబట్టి వంటల్లో పచ్చిపసుపును ఉపయోగించాలి. (Pixabay)
(3 / 6)
వెల్లుల్లిలో డయాలిల్ డైసల్ఫైడ్ అనే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనం ఉంటుంది, ఇది ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల ప్రభావాలను తగ్గిస్తుంది. అందువల్ల, వెల్లుల్లి వాపుతో పోరాడటానికి, కీళ్ల ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
(4 / 6)
అల్లంలోని గుణాలు శరీరంలో మంట, నొప్పిని కలిగించే పదార్థాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. కావున అల్లం తింటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.(Pinterest)
(5 / 6)
వాల్‌నట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కీళ్ల వ్యాధికి సంబంధించిన వాపును తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలు నొప్పిని తగ్గిస్తాయి.(Unsplash)
ఇతర గ్యాలరీలు