తెలుగు న్యూస్ / ఫోటో /
Telangana Govt Schemes : ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ స్కీమ్ అప్డేట్స్ - రానివారు అక్కడ మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు
- Telangana Govt Schemes Updates: ఉచిత్ విద్యుత్, రూ. 500 కే గ్యాస్ పథకాన్ని పట్టాలెక్కిస్తోంది తెలంగాణ సర్కార్. ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపిక విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆ వివరాలు ఇక్కడ చూడండి……
- Telangana Govt Schemes Updates: ఉచిత్ విద్యుత్, రూ. 500 కే గ్యాస్ పథకాన్ని పట్టాలెక్కిస్తోంది తెలంగాణ సర్కార్. ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో అర్హుల ఎంపిక విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఆ వివరాలు ఇక్కడ చూడండి……
(1 / 6)
గృహజ్యోతి : ఈ స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వనుంది ప్రభుత్వం.మహాలక్ష్మి : ఈ స్కీమ్ లో భాగంగా రూ. 500కే గ్యాస్ అందించనుంది.
(2 / 6)
ఈ గ్యారెంటీలను ఫిబ్రవరి 27వ తేదీన చెవేళ్ల వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. (INC Telangana Twitter)
(3 / 6)
ఈ పథకాల కోసం క్షేత్రస్థాయిలో ఇప్పటికే అర్హుల ఎంపిక పూర్తి అయింది. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సర్కార్…. వీటి కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించింది.
(4 / 6)
ఈ రెండు స్కీమ్ లకు ప్రధానంగా తెల్ల రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకున్నారు. ఆధార్ లింకింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. (INC Telangana Twitter)
(5 / 6)
తెల్ల రేషన్ కార్డు లేనివారు…ఈ స్కీమ్ కు అందే అవకాశం లేదు. దీనికితోడు కరెంట్ మీటర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి.(Minister KVR Twitter)
(6 / 6)
ఈ స్కీమ్ లకు పలు పత్రాలు లేని కారణంగా చాలా మంది అర్హత పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… ఉచిత విద్యుత్, గ్యాస్ స్కీమ్ కు అర్హత పొందలేని వారు ఇబ్బందిపడవద్దన్నారు. దరఖాస్తు చేసుకోలేనివారు మండల ఆఫీసుల్లో అప్లయ్ చేసుకోవచ్చని…. కావాల్సిన పత్రాలను అక్కడ సమర్పించుకోవచ్చని సూచించారు. మండల అధికారులు… వారి వివరాలను ఆన్ లైన్ లో ఎంట్రీ చేసి వచ్చే నెల నుంచి అర్హల జాబితాలో కొత్తవారని చేర్చుస్తారని చెప్పారు. నిరంతరంగా ప్రక్రియ ఉంటుందని, తెల్ల రేషన్ కార్డులు లేనివారికి కూడా అందిస్తామని పేర్కొన్నారు.
ఇతర గ్యాలరీలు