Nallamala Jungle Safari : నల్లమల ఫారెస్ట్ చూసొద్దామా..! జంగల్ సఫారీ సేవలు పునఃప్రారంభం
- Nallamalla Jungle Safari : నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ యాత్ర పునఃప్రారంభమైంది. మంగళవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 3 వాహనాలకు పూజ నిర్వహించి జెండా ఊపారు.

(1 / 5)
నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో జంగల్ సఫారీ యాత్ర పునఃప్రారంభమైంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి ప్రారంభించారు.
(2 / 5)
అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పర్యాటకుల కోసం నల్లమల్ల అటవీలో జంగిల్ సఫారీని నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇది ఆగిపోవటంతో… మంగళవారం మంత్రి దామోదర, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రారంభించారు.
(3 / 5)
పర్యాటకుల స్వర్గధామంగా నల్లమల్ల పేరు గాంచింది. అద్భుతమైన ఈ అడవిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పర్యాటకుల ప్రకృతి అందాలను తిలకించేలా జంగల్ సాఫరీని నిర్వహిస్తున్నారు.
(4 / 5)
నల్లమల ఫారెస్ట్ లోని జంతువులను వీక్షించడానికి ప్రత్యేకంగా తయారు చేసిన 3 వాహనాలకు పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు.
ఇతర గ్యాలరీలు